Telangana Cabinet : వానాకాలం వడ్లు మొత్తం కొనండి.. సీఎం కేసీఆర్ ఆదేశం

అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన చేపట్టనున్నారు.

Telangana Cabinet : వానాకాలం వడ్లు మొత్తం కొనండి.. సీఎం కేసీఆర్ ఆదేశం

Grain

procure all the monsoon grain : తెలంగాణ కేబినెట్ భేటీలో ధాన్యం కొనుగోలుపై చర్చ జరిగింది. వానాకాలం ధాన్యం కొనుగోలు జరుగుతున్న పరిస్థితులపై కేబినెట్ చర్చించింది. ఇప్పటికే ధాన్యం కొనుగోలు దాదాపు పూర్తి కావచ్చింది. అకాల వర్షాల వల్ల కొన్ని జిల్లాల్లో ధాన్యం ఇంకా కూడా కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ధాన్యం కొనుగోలు పూర్తిగా అయ్యేంతవరకు కేంద్రాలను కొనసాగించాలని సూచించింది. ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.

అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన చేపట్టనున్నారు. రేపు పరకాల నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటిస్తారు. అకాల వర్షానికి జరిగిన పంట నష్టాన్ని సీఎం పరిశీలించనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులు సిఎం కెసిఆర్ తో పాటు పర్యటనలో పాల్గొననున్నారు.

Corona Doctors : డాక్టర్లను వెంటాడుతున్న కరోనా.. ఉస్మానియాలో 159, గాంధీలో 120 మందికి పాజిటివ్

హనుమకొండ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలోని పరకాల మండలం, నడికూడ మండలంలో, నర్సంపేట మండలంలో అకాల వర్షానికి పంట నష్టం జరగడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి , నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తాను స్వయంగా పంట నష్టం జరిగిన పొలాల దగ్గరకు వస్తానని హామీ ఇచ్చారు.