Congress : జనంలోకి కాంగ్రెస్.. ఈనెల 21 నుంచి రచ్చబండ
వరంగల్ సభలో రాహుల్ గాంధీ సభతో వచ్చిన జోష్, ఉదయ్‌పూర్ కాంగ్రెస్ చింతన్ శివిర్‌లో తీర్మానాల మేరకు.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఐక్య కార్యాచరణకు పూనుకున్నారు.

Telangana Congress : వరంగల్ సభ…ఉదయ్‌పూర్ సమావేశం…ఈ రెండింటి తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. వరంగల్ డిక్లరేషన్‌ను జనంలోకి తీసుకెళ్లడం ద్వారా కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. జనంలోకి వెళ్లి విస్తృత ప్రచారం చేయాలని టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గం నిర్ణయించింది.
వరంగల్ సభలో రాహుల్ గాంధీ సభతో వచ్చిన జోష్, ఉదయ్‌పూర్ కాంగ్రెస్ చింతన్ శివిర్‌లో తీర్మానాల మేరకు.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఐక్య కార్యాచరణకు పూనుకున్నారు. హైదరాబాద్‌లో కూర్చుని బిర్యానీలు తింటూ, ఇరానీ చాయ్‌లు తాగితే కుదరదని రాహుల్‌గాంధీ స్పష్టం చేయడంతో.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కాళ్లకు పనిచెప్పనున్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.
Congress Party : కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్
వరంగల్‌లో రైతు సంఘర్షణ సభ, రాహుల్ గాంధీ ప్రసంగంతో పార్టీ కార్యకర్తల్లో జోష్ వచ్చిందని టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ జోష్ కంటిన్యూ అయ్యేలా… ఈ నెల 21 నుంచి నెల రోజుల పాటు కాంగ్రెస్ నేతలంతా జనంలోనే ఉండాలని నిర్ణయించారు. గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం చేయనున్నారు.
చారిత్రక నేపథ్యం ఉన్న అన్ని గ్రామాల్లోనూ కాంగ్రెస్ రచ్చబండలు జరగనున్నాయి. ఈ రచ్చబండ కార్యక్రమాల్లో కాంగ్రెస్ కీలక నేతలు హాజరై ప్రసంగిస్తారు. 12 వేల పంచాయతీల్లో జరగనున్న రచ్చబండలకు 400 మంది కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
- T Congress: రాహుల్‌తో ముగిసిన టీ కాంగ్రెస్ లీడర్ల భేటీ.. ఏప్రిల్ 4న మళ్లీ సమావేశం..!
- Animal Husbandry : వేసవి పశుపోషణలో జాగ్రత్తలు
- Sankranthi : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు
- Pongal rush: సంక్రాంతి సందడి.. పట్నం వదిలి పల్లెలకు.. కాస్త భయం!
- Telangana : టి.కాంగ్రెస్ శాసనసభాపక్షం అత్యవసర భేటీ..ఎందుకో
1Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
2Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
3Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
4Cervical Spondylosis: సర్వికల్ స్పాండిలోసిస్ కోసం 5 యోగాసనాలు
5Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
6Telangana : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
7TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్
8Tirupati : నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
9Drugs : ఢిల్లీ-టూ-హైదరాబాద్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
10Maharashtra: శివసేనకు షాక్.. రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు
-
Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
-
Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
-
Ram Pothineni: తమిళ డైరెక్టర్స్‌కే రామ్ ప్రిఫరెన్స్..?
-
Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
-
Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ