బడ్జెట్ సమావేశాల కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమౌతోంది. అధికారులు శాఖల వారీగా తాజా నివేదికలను రూపొందిస్తున్నారు. సీఎస్ సోమేశ్ కుమార్ అన్ని శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించారు.

బడ్జెట్ సమావేశాల కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు

Telangana budget meetings : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమౌతోంది. అధికారులు శాఖల వారీగా తాజా నివేదికలను రూపొందిస్తున్నారు. సీఎస్ సోమేశ్ కుమార్ అన్ని శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ఫిబ్రవరి వరకు ఉన్న పరిస్థితులపై అధికారులు రిపోర్ట్ రెడీ చేస్తున్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 15 నుంచి ప్రారంభంకాబోతున్నాయి‌.

బడ్జెట్‌ కోసం వివిధ శాఖలను తెలంగాణ ప్రభుత్వం సమాయాత్తం చేస్తోంది. అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు ప్రతిపాదనలు రెడీ చేయాలని సీఎస్ సోమేశ్‌ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. శాసన సభ, మండలిలో పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు పంపాలని అధికారులను ఆదేశించారు. సమావేశాల్లో ఉత్పన్నమయ్యే.. స్పెషల్ మెన్సన్స్‌, ఎల్‌ఏ క్యూస్, ఎల్‌సీ క్యూస్ అస్యురెన్స్‌కు సంబంధించిన సమాచారంతో అధికారులు రెడీగా ఉండాలని సీఎస్ తెలిపారు.

ప్రధాన కార్యదర్శి ఆదేశాలతో మొత్తం 34శాఖల అధికారులు నివేదికలు సిద్ధం చేసుకుంటున్నారు. అసెంబ్లీ ప్రారంభవడానికి రెండు రోజుల ముందు వరకూ లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ను సేకరిస్తున్నారు అధికారులు. సమావేశాలు జరిగే సమయంలో అసెంబ్లీ అధికారులతో సమన్వయం చేసుకునేలా కసరత్తు చేస్తున్నారు వివిధ శాఖల అధికారులు. జీరో అవర్‌లో వచ్చే ప్రశ్నలకు వెంటనే సమాధానాలు ఇచ్చేలా సీఎస్ సోమేశ్ కుమార్ సర్వం సిద్ధం చేస్తున్నారు.

మొత్తానికి.. అసెంబ్లీ సమావేశాలను సమర్ధవంతంగా నడిపేందుకు కసరత్తు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. తడుముకోకుండా ప్రతిపక్షాలు విసిరే ప్రశ్నలకు సమాధానం చెప్పేలా సిద్ధమవుతోంది. ఈ నెల 13కి పూర్తిస్థాయిలో రిపోర్టులు వచ్చే అవకాశముంది.