Telangana : కోవిడ్ నిబంధనలు అనుసరించి.. రేపటి నుంచి స్కూల్స్ లో ఆఫ్ లైన్ క్లాసులు

రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1, 2021 నుంచి స్కూల్స్ ఓపెన్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. కోవిడ్ నిబంధనలు అనుసరించి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించవచ్చని సూచించింది.

Telangana : కోవిడ్ నిబంధనలు అనుసరించి.. రేపటి నుంచి స్కూల్స్ లో ఆఫ్ లైన్ క్లాసులు

Schools

schools to open : రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1, 2021 నుంచి స్కూల్స్ ఓపెన్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. కోవిడ్ నిబంధనలు అనుసరించి రేపటి నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించవచ్చని సూచించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే న్యాయస్థానం అందుకు అనుమతులను కూడా ఇవ్వడం జరిగింది.

హైకోర్టు ఆదేశాల మేరకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ తరగతులకు అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ రెసిడెన్షియల్, సాంఘిక సంక్షేమ పాఠశాలలు, గిరిజన సంక్షేమ పాఠశాలలు, హాస్టల్స్ మినహా అన్ని విద్యా సంస్థలు రేపటి నుంచి తెరిచేందుకు అనుమతిచ్చింది. ప్రత్యక్ష తరగతులపై విద్యార్థులను స్కూల్స్ యాజమాన్యాలు బలవంతపెట్టొద్దని ప్రభుత్వం ఆదేశించింది.

తమ పిల్లల్ని స్కూల్స్ కు పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడకపోతే స్కూల్ మేనేజ్ మెంట్స్ బలవంతం చేయకూడదని తెలిపింది. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లేదా ఏదైనా నిర్వహించుకునే అధికారం పాఠశాలలకు ఉందన్నారు. ఆన్‌లైన్‌, ఆఫ్ లైన్ బోధనపై పాఠశాలలదే నిర్ణయమని పేర్కొంది. పాఠశాలలు అనుసరించాల్సిన విధివిధాలను రూపొందించాలని ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు ఆదేశాలిచ్చింది.

పిల్లలకు స్కూల్స్ లో ఏమైనా జరిగినా, వైరస్ సోకినా స్కూల్ యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదని పేరెంట్స్ నుంచి ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు తీసుకుంటున్న అనుమతి పత్రం చట్టపరంగా చెల్లదని స్పష్టం చేసింది.

అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఎస్‌ఓపీలపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.