Telangana : వరిసాగు తగ్గించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం.. ప్రత్యామ్నాయ పంటలపై ఫోకస్

తెలంగాణలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. రాష్ట్రంలో ఆశించిన దానికంటే వరి దిగుబడులు రావడంతో ప్రత్యామ్నాయ పంటలు వేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది.

Telangana : వరిసాగు తగ్గించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం.. ప్రత్యామ్నాయ పంటలపై ఫోకస్

Cm Kcr

reduce paddy cultivation : తెలంగాణలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. రాష్ట్రంలో ఆశించిన దానికంటే అధికంగా వరి దిగుబడులు రావడంతో ప్రత్యామ్నాయ పంటలు వేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నివేదికను సమర్పించారు. 20 శాతం వరిని తగ్గించి ఇతర పంటలు వేయాలని సర్కార్ సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చింది.

ప్రగతి భవన్‌లో పంటల సాగుపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్.. యాసంగి పంటల ప్రణాళికపై చర్చించారు. ఏ ప్రాంతాల్లో ఏ ఏ పంటలు వేయాలి..? వరికి ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేస్తే రైతులకు ఉపయోగం..? మార్కెట్‌లో పంటల డిమాండ్ ఎలా ఉంది..? డిమాండ్‌ను బట్టి మార్కెటింగ్ రీసెర్చ్, అనాలసిస్ వింగ్ సూచనలకు సంబంధించిన నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేశారు. అతి త్వరలో యాసంగి పంటల ప్రణాళికను సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు. గతంలో సన్నాలు వేయడంతో వచ్చిన ఇబ్బందులను, వరి అధిక దిగుబడిని గురించి చర్చించారు.

TS Assembly: తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లు పాస్..!

తెలంగాణలో 2020-21 వాన కాలంలో 48 పాయింట్‌ 82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని అధికారులు కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. అదే యాసంగిలో 90 పాయింట్‌ 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందనీ చెప్పారు. 2020-21 సంవత్సరంలో మొత్తం 139 పాయింట్‌ 22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని చెప్పారు వ్యవసాయ శాఖ అధికారులు. ఇందులో కేంద్రం ఎఫ్‌సీఐ ద్వారా 80 శాతం మాత్రమే కొనుగోలు చేసిందనే విషయాన్ని గుర్తుచేశారు. మిగతా ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం తంటాలు పడాల్సి వస్తోందని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని.. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో చర్చలు జరిపిన అనంతరం తీసుకోవాల్సిన నిర్ణయాలపై.. ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడకుండా ఈసారి ఇతర పంటలను ప్రోత్సహించాలని భావిస్తోంది ప్రభుత్వం. యాసంగిలో 10 లక్షల ఎకరాల్లో వరి సాగును తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు క్లస్టర్ వ్యూహాన్ని అనుసరించాలని సీఎం కేసీఆర్ ఇదివరకే సూచించారు. ఐదు ప్రత్యామ్నాయ పంటలైన శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, పెసర పంటలు పండిస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని వ్యవసాయ శాఖ చెబుతోంది.

Hyderabad : ఎలర్జీ సమస్యలతో బాధ పడుతున్నారా..డోంట్ వర్రీ

పంటల సరళిపై రైతులను సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రాబోయే సీజన్లలో వరి సాగును క్రమంగా 20 శాతం తగ్గించడం కోసం అధికారులు ప్రణాళిక రెడీ చేశారు. ప్రత్యామ్నాయ పంటలతో ముందుకు సాగడానికి మూడు జోన్లుగా గుర్తించి ప్రత్యామ్నయ పంటలు ప్రోత్సహించాలని సర్కార్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 30 జిల్లాలలో లక్షణాల ఆధారంగా అవి మూడు జోన్లుగా వర్గీకరించనున్నారు అధికారులు. వీటిని బెస్ చేసుకొని వరికి అల్టర్నెట్ పంటలను సాగు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.