IAS Transfer : తెలంగాణలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు బదిలీ

తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఇద్దరు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

10TV Telugu News

TS govt transferred two IAS : తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఇద్దరు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శిగా సునీల్‌ శర్మ పని చేస్తున్నారు.

అయితే ఆయనకు గృహనిర్మాణ శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. అలాగే ఆర్‌ అండ్‌ బీ కార్యదర్శిగా కేఎస్‌ శ్రీనివాసరావుకు అదనపు బాధ్యతలు కేటాయించింది.