Telangana Govt : పెండింగ్ బిల్లులు ఆమోదించేలా గవర్నర్ కు ఆదేశాలివ్వాలని.. సుప్రీంకోర్టులో టీఎస్ సర్కార్ పిటిషన్
పెండింగ్ బిల్లుల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి, రాజ్ భవన్ కు మధ్య పంచాయితీ కొనసాగుతూనేవుంది. గవర్నర్ తమిళిసై కీలక బిల్లులను ఆమోదించకపోవడంపై టీఎస్ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.

Supreme Court (2)
Telangana Govt : పెండింగ్ బిల్లుల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి, రాజ్ భవన్ కు మధ్య పంచాయితీ కొనసాగుతూనేవుంది. తెలంగాణ ప్రభుత్వం-గవర్నర్ పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది. గవర్నర్ తమిళిసై కీలక బిల్లులను ఆమోదించకపోవడంపై టీఎస్ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
పెండింగ్ లో ఉన్న 10 కీలక బిల్లులను ఆమోదించేలా గవర్నర్ తమిళిసైకి ఆదేశాలివ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ గవర్నర్ తమిళిసైకి నోటీసులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇస్తామని కోర్టు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు కేంద్రం అభిప్రాయం కోరింది. తదుపరి విచారణను మార్చి27కి వాయివా వేసింది.