Telangana Govt : ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌

మూల వేత‌నంపై 5 శాతం డీఏను చెల్లించ‌నున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. దీంతో సంస్థపై నెల‌కు 5 కోట్ల రూపాయల భారం ప‌డ‌నున్నట్లు వెల్లడించింది.

Telangana Govt : ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌

Tsrtc

Telangana government : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల‌కు ప్రభుత్వం తీపిక‌బురు చెప్పింది. వ‌చ్చే నెల నుంచి వేత‌నాల‌కు అద‌నంగా 5 శాతం డీఏ క‌లిపి చెల్లించ‌నున్నట్లు ప్రక‌టించింది. మూల వేత‌నంపై 5 శాతం డీఏను చెల్లించ‌నున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. దీంతో సంస్థపై నెల‌కు 5 కోట్ల రూపాయల భారం ప‌డ‌నున్నట్లు వెల్లడించింది.

TSRTC: డీజిల్ బస్సులపై టీఎస్‌ఆర్టీసీ ప్రయోగాలు.. ఎలక్ట్రిక్‌గా మార్చే ఆలోచన!

మూల వేత‌నంపై ఉద్యోగులందరికీ 5 శాతం డీఏ చెల్లించ‌నుండ‌గా… డ్రైవర్, కండక్టర్, శ్రామిక్ వంటి యూనిఫారం ఉద్యోగులకు కనిష్ఠంగా 600 నుంచి గరిష్ఠంగా 15వందల రూపాయల వరకు భత్యం జతకలుస్తుందని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. వివిధ కేటగిరీల్లోని అధికారులకు 15వందల నుంచి 5వేల 500 వరకు వేతనం అదనంగా అందనుంద‌ని తెలిపింది.