Foreign Students : విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి గుడ్ న్యూస్, నో పెయిడ్ క్వారంటైన్

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పెయిడ్‌ క్వారంటైన్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఏడు రోజులపాటు హోటల్‌ లేదా ప్రభుత్వం సూచించిన ప్రాంతాల్లో క్వారంటైన్‌లో ఉండేవారు

Foreign Students : విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి గుడ్ న్యూస్, నో పెయిడ్ క్వారంటైన్

Tg Govt

Telangana State Government : విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పెయిడ్‌ క్వారంటైన్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఏడు రోజులపాటు హోటల్‌ లేదా ప్రభుత్వం సూచించిన ప్రాంతాల్లో క్వారంటైన్‌లో ఉండేవారు. ఇకపై వారు నేరుగా ఇళ్లకు వెళ్లిపోవచ్చని ప్రభుత్వం తెలిపింది. దేశీయ ప్రయాణికుల సైతం నిబంధనలను సడలించింది తెలంగాణ సర్కార్.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త నిబంధనలను ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారికంగా ప్రకటించింది. విదేశాల నుంచి వచ్చేవారు ప్రయాణానికి 72 గంటల ముందు కొవిడ్‌ పరీక్ష చేయించుకుని రావాలి. హైదరాబాద్‌ చేరుకున్నాక విమానాశ్రయంలోనూ పరీక్ష చేయించుకోవాలి. ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వైద్యాధికారుల సలహా మేరకు ఇంట్లో ఉండాలి లేదా ఆసుపత్రిలో చేరాలి.

మరోవైపు..తెలంగాణలో గురువారం నుంచి కొత్త లాక్‌డౌన్‌ రూల్స్ అమల్లోకి రావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇన్నిరోజులు కరోనా టెస్ట్ చేయించుకోవాలన్నా.. టీకా వేయించుకోవడానికి వెళ్లాలన్నా ఆటో, క్యాబ్‌లకు అధిక ధరలు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు సాయంత్రం 5 గంటల వరకు సడలింపు ఇవ్వడంతో పబ్లిక్‌ ట్రాన్స్‌ పోర్ట్ అందుబాటులోకి వచ్చింది. బస్సులు, మెట్రో ట్రైన్‌లలో ప్రయాణికులు పెరిగారు. ఇన్నిరోజులు పరిమిత ప్రాంతాలకు నడిచిన బస్సులు ఇవాళ్టి నుంచి అన్నిప్రాంతాల్లో తిరిగాయి. అటు ఆటోలు, క్యాబ్‌ల ధరలు కూడా దిగివచ్చాయి.

Read More : Cannabis Smuggler : విజయనగరం జిల్లాలో గంజాయి స్మగ్లర్ల హల్‌చల్