Hyderabad : గోవులను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్న గో రక్షక్ సభ్యులు.. కత్తులతో దాడి చేసిన దుండగులు

దుండగులను అరెస్టు చేయాలంటూ హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. అక్కడకు భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి.

Hyderabad : గోవులను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్న గో రక్షక్ సభ్యులు.. కత్తులతో దాడి చేసిన దుండగులు

Hyderabad (1)

cows moving Blocked vehicle : హైదరాబాద్ కర్మన్ ఘాట్ లో ఉద్రిక్తత నెలకొంది. గోవులను తరలిస్తున్న బులెరో వాహనాన్ని గో రక్షక్ సభ్యులు అడ్డుకున్నారు. గో రక్షక్ సభ్యుల వాహనాన్ని వెనుక నుండి బులెరో వాహనం ఢీకొట్టింది. దుండగులు కత్తులతో దాడి చేసి ఇన్నోవా వాహనాన్ని ధ్వంసం చేశారు. గో రక్షక్ సభ్యులు భయంతో పరుగులు తీసి టెంపుల్ లోకి పరుగుల తీశారు.

టెంపుల్ లో దుండగులు కత్తులతో దాడి చేశారు. కర్మన్ ఘాట్ ఆంజనేయ టెంపుల్ కు భారీగా హిందూ సంఘాలు చేరుకుంటున్నాయి. దుండగులను అరెస్టు చేయాలంటూ హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. అక్కడకు భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. మహేశ్వరం నియోజకవర్గ ఇన్ ఛార్జీ, బీజేపీ నేత అందెల శ్రీరాములు యాదవ్ హుటా హుటినా ఘటననా స్థలానికి చేరుకున్నారు.

CM Jagan Goshala : సీఎం జగన్ నివాస ప్రాంగణంలో గోశాల.. అప్‌డేటేడ్ టెక్నాలజీతో నిర్మాణం

బీజేపీ నేతల రాకతో పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారింది. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించిన శ్రీరాములు యాదవ్, బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు.