Love Problem: ఆమెతో పెళ్లి చెయ్యండి.. లేదంటే దూకుతా

ప్రేమించిన యువతితో పెళ్లి జరిపించాలని ఓ యువకుడు హంగామా చేశాడు. వాటర్ ట్యాంక్ ఎక్కి కిందకు దూకుతా అంటూ బెదిరించాడు. బీర్ సీసాతో తలపై మొదుకుంటూ గట్టిగా కేకలు వేశాడు.

Love Problem: ఆమెతో పెళ్లి చెయ్యండి.. లేదంటే దూకుతా

Love Problem

Love Problem: ప్రేమించిన యువతితో పెళ్లి జరిపించాలని ఓ యువకుడు హంగామా చేశాడు. వాటర్ ట్యాంక్ ఎక్కి కిందకు దూకుతా అంటూ బెదిరించాడు. బీర్ సీసాతో తలపై మొదుకుంటూ గట్టిగా కేకలు వేశాడు. చివరకు పోలీసులు నచ్చచెప్పి వాటర్ ట్యాంక్ మీదనుంచి కిందకు దింపారు. కాకా ఈ ఘటన వికారాబాద్ జిల్లా దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మండలంలోని ఖమ్మం నాచారం గ్రామానికి చెందిన వినోద్ అనే యువకుడికి గజ్వేల్ కు చెందిన ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్‌ లో పరిచయమైంది.

వీరి మధ్య స్నేహం ఏర్పడింది. కొద్దీ రోజులకు ప్రేమగా మారింది. ఇక ఈ నేపథ్యంలోనే యువకుడు సదరు యువతిని తీసుకోని ఇంటికి వచ్చాడు. అయితే వినోద్ తల్లిదండ్రులు అతడిని మందలించి యువతి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వినోద్ ఇంటికి వచ్చి ఆ యువతిని తీసుకెళ్లారు.

ఈ క్రమంలోనే ప్రియురాలు తనకు దూరమవుతుందన్న బాధలో వినోద్ మద్యం సేవించి వాటర్ ట్యాంక్ ఎక్కాడు. పైకి ఎక్కి నానా యాగీ చేశాడు. గ్రామస్తులు ఎంత చెప్పినా వినకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు యువకుడికి నచ్చచెప్పి కిందకు దించి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. కతల్లిదండ్రుల సమక్షంలో వినోద్ కి కౌన్సిలింగ్ ఇచ్చారు.