Nude Video Blackmail : యువకుడి నగ్న వీడియో రికార్డ్ చేసి యువతి బ్లాక్ మెయిల్

యువకుడి నగ్న వీడియోను స్ర్కీన్ రికార్డు చేసి మరో లేడీ బ్లాక్ మెయిల్ కు పాల్పడింది. డేటింగ్ యాప్ లో పరిచయమైన యువతితో జీడిమెట్లకు చెందిన యువకుడు నగ్నంగా వీడియో కాల్స్ చేశాడు.

Nude Video Blackmail : యువకుడి నగ్న వీడియో రికార్డ్ చేసి యువతి బ్లాక్ మెయిల్

The Young Woman Who Recorded The Nude Video And Blackmailed The Young Man

young woman blackmailed young man : ముందు ఫేస్ బుక్ లో పరిచయం అవుతారు. ఆ తర్వాత క్లోజ్ గా మూవ్ అవుతారు. ఆ పై వాట్సాప్ కాల్ చేస్తారు. అందులో నూడ్ గా కనిపిస్తారు. నూడ్ గా కనిపించేలా కవ్విస్తారు. పొరపాటున.. దుస్తులు విప్పి మీది కానీ చూపించారో.. ఇక అంతే.. అడ్డంగా బుక్కైపోతారు. అటువైపు నుంచి బ్లాక్ మెయిల్ స్టార్ట్ అవుతుంది. మీ నూడ్ వీడియోస్ ను అడ్డం పెట్టుకుని డబ్బు డిమాండ్ చేస్తారు. అడిగినంత ఇచ్చుకోకపోతే.. పరువు తీస్తామని బెదిరిస్తారు. ఇంకేముంది.. వారు అడిగినంత అమౌంట్ ఇచ్చుకోవడమే.

ఇటీవలి కాలంలో ఈ తరహా మోసాలు బాగా పెరిగాయి. సోషల్ మీడియాలో కొత్త వ్యక్తులతో పరిచయాలు వద్దని పోలీసులు నెత్తీ నోరు బాదుకుని చెబుతున్నా కొందరిలో మార్పు రావడం లేదు. సోషల్ మీడియాలో కొత్త వ్యక్తులతో ఫ్రెండ్ షిప్ చేసి నిండా మునుగుతున్నారు. కక్కుర్తి పడి జేబులు గుళ్ల చేసుకుంటున్నారు. లక్షలకు లక్షలు సమర్పించుకుంటున్నారు.

తాజాగా యువకుడి నగ్న వీడియోను స్ర్కీన్ రికార్డు చేసి మరో లేడీ బ్లాక్ మెయిల్ కు పాల్పడింది. డేటింగ్ యాప్ లో పరిచయమైన యువతితో జీడిమెట్లకు చెందిన యువకుడు నగ్నంగా వీడియో కాల్స్ చేశాడు. నగ్న వీడియోను స్క్రీన్ రికార్డ్ చేసిన యువతి.. ఆ యువకుడిని బ్లాక్ మెయిల్ చేసింది. దీంతో బాధితుడు పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

2021, మార్చి 27వ తేదీన హైదరాబాద్ లో అలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. ఓ మాయ లేడీ.. నూడ్ వీడియోస్ తో బ్లాక్ మెయిల్ చేసి ఈవెంట్ మేనేజ్ నుంచి రూ.10లక్షలు లాగింది. అయినా ఆమె ఆశ తీరలేదు. ఇంకా డబ్బు కావాలని బెదిరింపులకు దిగడంతో బాధితుడు మరోదారి లేక సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

తార్నాకలో నివసించే ఓ వ్యక్తి ఈవెంట్‌ మేనేజర్‌ హోదాలో ఫేస్‌బుక్‌ అకౌంట్ నిర్వహిస్తున్నాడు. వారం క్రితం ఓ యువతి అతడికి ఫ్రెండ్ షిప్ రిక్వెస్ట్ పంపిది. అమ్మాయి కావడంతో అతడు వెంటనే యాక్సెప్ట్ చేశాడు. ఆ మర్నాడు ఆ యువతి వాట్సప్‌ నెంబర్ అడిగితే అదీ ఇచ్చాడు. తాను ముంబైలో మోడలింగ్‌ చేస్తున్నానని ఆమె తెలిపింది.

ఈ క్రమంలో రెండు రోజుల క్రితం యువతి అతడికి వాట్సప్‌ వీడియోకాల్‌ చేసింది. మాట్లాడుతూనే తన ఒంటి మీదున్న దుస్తులన్నీ తీసేసింది. నూడ్ గా అతడిని కవ్వించింది. అంతేకాదు.. అతనితోనూ అలాగే చేయించింది. అమ్మాయిని నూడ్ గా చూసిన ఆనందంలో అతడు మైమరిచిపోయాడు. కాసేపట్లోనే అతడి ఆనందం ఆవిరైంది. ఊహించని షాక్ తగిలింది.

తాను రికార్డ్ చేసిన అతడి నూడ్ వీడియోను ఆ యువతి అతడికి పంపించింది. బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేసింది. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆ నూడ్ వీడియోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తానని బెదిరించింది. దీంతో ఈవెంట్ మేనేజర్ కి దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది. పరువు పోతుందనే భయంతో ఆమె అడిగినంత డబ్బు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు.