Errabelli Vs Nannapaneni: ‘దమ్ముంటే రాజీనామా చేసి రా’ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కు ఎర్రబెల్లి ప్రదీప్ రావు సవాల్

వరంగల్ లో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్.. మంత్రి దయాకర్ రావు తమ్ముడైన ఎర్రబెల్లి ప్రదీప్ రావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రదీప్ రావుపై ఎర్రబెల్లి బూతులతో విరుచుకుపడితే..ప్రదీప్ రావు ఎర్రబెల్లికి రాజకీయ సవాల్ విసిరారు. ‘దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రా..ఎన్నికల్లో పోటీ చేస్తే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది..నువ్వు ఓరుగల్లు బిడ్డవైతే..నా సవాల్ ను స్వీకరించు..ఎన్నికల్లో చూసుకుందాం’ అంటూ సవాల్ విసిరారు.

Errabelli Vs Nannapaneni: ‘దమ్ముంటే రాజీనామా చేసి రా’ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కు ఎర్రబెల్లి ప్రదీప్ రావు సవాల్

errabelli pradeep rao Vc Nannapaneni Narender

errabelli pradeep rao Vc Nannapaneni Narender : వరంగల్ లో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్.. మంత్రి దయాకర్ రావు తమ్ముడైన ఎర్రబెల్లి ప్రదీప్ రావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రదీప్ రావుపై ఎర్రబెల్లి బూతులతో విరుచుకుపడ్డారు. దీనిపై స్పందించిన ప్రదీప్ రావు ఎర్రబెల్లికి రాజకీయ సవాల్ విసిరారు. ‘దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రా..ఎన్నికల్లో పోటీ చేస్తే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది..నువ్వు ఓరుగల్లు బిడ్డవైతే..నా సవాల్ ను స్వీకరించు..ఎన్నికల్లో చూసుకుందాం’ అంటూ సవాల్ విసిరారు. నువ్వు పార్టీ తరపున వస్తావో..మరి ఏ తరపున వస్తోవో నీ ఇష్టం..నేను మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థిగా నీమీద పోటీ చేస్తా..దమ్ముంటే రా అంటూ సవాల్ విసిరారు. వీరి సవాళ్లతో వరంగల్ లో రాజకీయ రచ్చ కొనసాగుతోంది.

నాలుగైదు రోజుల కిందట ఎర్రబెల్లి ప్రదీప్ రావు ను ఉద్దేశించి ఎమ్మెల్యే నరేందర్ తీవ్ర పదజాలంతో దుషించారు. వరంగల్ తూర్పు నియోజక వర్గాన్ని 4 వేల కోట్లతో డెవలప్ మెంట్ చేశానని చెప్పుకొచ్చారు. దీంతో దమ్ముంటే రాజీనామా చేసి అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని ఎర్రబెల్లి ప్రదీప్ రావు సవాల్ విసిరారు. ఆగస్టు 10 వరకు నరేందర్ రాజీనామా చేసి మళ్లీ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని..లేకుంటే నరేందర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ప్రదీప్ డిమాండ్ చేశారు. దీంతో వరంగల్ తూర్పు లో రాజకీయ దుమారం రేపుతోంది. కాగా..ఇటీవల టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ప్రదీప్ రావు… ఈ నెల 21న మునుగోడు జరగనున్న బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లుగా సమాచారం.

కాగా.. ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తన పుట్టినరోజు నాడు..బర్త్ డే సెలబ్రేషన్స్ వేదికపైనే రెచ్చిపోయారు. TRS పార్టీకి రాజీనామా చేసి..BJP తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు ను టార్గెట్ చేసి ఇష్టానురీతిగా వ్యాఖ్యలు చేశారు. ఎర్రబెల్లి ప్రదీప్ రావుతో పాటు ఆయన అనుచరులపై విరుచుకుపడిన ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ టిఆర్ఎస్ పార్టీని మోసం చేస్తే చీరేస్తాం అంటూ వ్యాఖ్యలు చేశారు.

నేను అమాయకుడు అని అనుకుంటున్నారేమో..అవసరమైతే కొమరం భీమ్ లా తిరగబడతా.. పులిలా పంజా విసిరి చీరేస్తానని అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఇక రోజులు లెక్క పెట్టుకోండి అంటూ హెచ్చరికలు జారీ చేశారు నన్నపనేని నరేందర్. ఈక్రమంలో నన్నపనేనికి ఎర్రబెల్లి ప్రదీప్ రావు  సవాల్ విసిరారు. పదవిలో ఉండి మాట్లాడటంకాదు..ప్రజల్లో ఎవరికి ఎక్కువ అభిమానం ఉందో తేల్చుకుందాం రాజీనామా చేసి రా అంటూ సవాల్ విసిరారు.