Telangana : సీఎం కేసీఆర్ డిమాండ్స్ ఇవే..కేంద్రం వెంటనే స్పందించాలి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్..పలు డిమాండ్స్ వినిపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే వాటిపై స్పందించాలని కోరారు.

Telangana : సీఎం కేసీఆర్ డిమాండ్స్ ఇవే..కేంద్రం వెంటనే స్పందించాలి

Kcr Demands

CM KCR Demands : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్..పలు డిమాండ్స్ వినిపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే వాటిపై స్పందించాలని కోరారు. రాష్ట్ర విభజన అయినప్పపటి నుంచి పెండింగ్ లో ఉన్నవి ఇంకా పరిష్కారం కాలేదన్నారు. అంతేగాకుండా..తాము అసెంబ్లీ నుంచి చేసిన తీర్మానాలను కూడా ఇంకా పరిష్కరించలేదని విమర్శించారాయన. వీటికి పరిష్కారం కాకపోవడంతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై ఎఫెక్ట్ పడుతోందన్నారు. తాము ఈ విషయాలను మరోసారి కేంద్రం దృష్టికి తీసుకపోవడానికి తాను, మంత్రులు, ఎంపీలు, ఉన్నతాధికారులతో కలిసి ఆదివారం ఢిల్లీ పర్యటనకు వెళుతున్నట్లు వెల్లడించారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండి..కేంద్ర మంత్రులు, ఇతర ఉన్నతాధికారులను కలవడం జరుగుతుందని, అవసరమైతే ప్రధాన మంత్రిని కూడ కలిసి ఆయా అంశాలను ప్రస్తావిస్తామన్నారు.

Read More : New Power Bill : విద్యుత్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి…రాష్ట్రాలపై ఒత్తిడి వద్దు

2021, నవంబర్ 20వ తేదీ శనివారం సాయంత్రం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం తాత్సారం చేయవద్దని, ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరడం జరుగుతుందన్నారు. కేంద్రం, ఎఫ్ సీఐ స్పందించాయని.. ధాన్యం కొనుగోలు విషయం, బాయిల్డ్ రైస్ కొనమని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయన్నారు. ఈ విషయంలో ఢిల్లీలో తేల్చుకుంటామన్నారు సీఎం కేసీఆర్. దీనితో పాటు పలు డిమాండ్స్ వినిపించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్యనున్న నీటివాటాలు తేల్చేయాలన్నారు.

Read More : CM KCR Demands : సహనాన్ని పరీక్షించొద్దు..నీటి వాటాలు తేల్చేయాలి, లేకపోతే ఇక పోరాటాలే

గిరిజనులకు సంబంధించి రిజర్వేషన్ పెంచుకుంటామని అని చెప్పి..కేంద్రాన్ని కోరితే కూడా స్పందించలేదన్నారు. 2017 నుంచి ఎన్నోమార్లు లేఖలు రాసినా కూడా స్పందన లేదని, ఈ విషయంలో కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఎస్టీ రిజర్వేషన్ విషయంలో కూడా ఉద్యమాలు జరిగి ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఈ విషయంలో కూడా తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని, దీనిని కూడా తేల్చాలన్నారు. బీసీ కులగణన చేయాలనే డిమాండ్ ఉందనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. లెక్కలు తేల్చితే తప్పేంటీ అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీల విషయంలో ఎలా లెక్క తీశారో..ఇందులో తేల్చితే ఏమవుతుంది ? దాచడం ఎందుకు..దేశం ఏం సాధిస్తుందని ప్రశ్నించారు. రాబోయే జనగణనలో బీసీ కులగణన చేయాలన్ని సూచించారు సీఎం కేసీఆర్.

Read More : Farm Laws : ఆ రైతుల ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షలు ఇస్తాం..కేంద్రం రూ. 25 లక్షలు ఇవ్వాలి

మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసి చేతులు దులుపు కోవడం కాదని..ఆందోళనల్లో చనిపోయిన రైతుల కుటుంబాలను కూడా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతు ఉద్యమాల క్రమంలో..వేల వేల కేసులు పెట్టారని, సారీ చెప్పి దులుపుకొంటే కాదన్నారు. వెంటనే కేసులను ఎత్తివేయాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని తాము కోరడం జరుగుతోందన్నారు.