DH Srinivasa Rao : కొత్త వేరియంట్ వస్తే తప్ప థర్డ్ వేవ్ రాదు : డీహెచ్ శ్రీనివాసరావు

రాష్ట్రంలో కోవిడ్ నేపథ్యంలో చాలా కాలం తరువాత స్కూల్స్ రీ ఓపెన్ చేసుకున్నాము కాబట్టి... తల్లిదండ్రుల్లో భయం పోలేదని అర్థమవుతుందని తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు అన్నారు.

DH Srinivasa Rao : కొత్త వేరియంట్ వస్తే తప్ప థర్డ్ వేవ్ రాదు : డీహెచ్ శ్రీనివాసరావు

Srinivas

new variant : రాష్ట్రంలో కోవిడ్ నేపథ్యంలో చాలాకాలం తరువాత స్కూల్స్ రీ ఓపెన్ చేసుకున్నాము కాబట్టి… తల్లిదండ్రుల్లో కొంత భయం పోలేదని అర్థమవుతుందని తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు అన్నారు. ప్రతిరోజూ కేసుల నమోదు చాలా తక్కువగా ఉందన్నారు. రికవరీ 98.5శాతం ఉందని తెలిపారు. చిన్న పిల్లల్లో తక్కువగా ఇన్ఫెక్షన్ ఉందని, పెద్దవారిలో ఎక్కువగా ఇన్ఫెక్షన్ ఉందన్నారు. మరణాల సంఖ్య కూడా పెద్దవారిలొనే ఎక్కువగా ఉందని తెలిపారు. థర్డ్ వేవ్ వచ్చేస్తుంది.. అక్టోబర్ లో స్పీడ్ పెంచనుంది అని అంటున్నారు కానీ తెలంగాణాలో కొంత కట్టడి చేయగలిగామని పేర్కొన్నారు. ICMR సర్వేలో పెద్దలు ఎక్కువగా వైరస్ కు ఎక్స్ పోస్ అయ్యారని తెలిపిందని చెప్పారు. చిన్న పిల్లల్లో కూడా 50శాతం వరకు ఇన్ఫెక్టు అయ్యారని పేర్కొన్నారు.

పండగల సమయంలో కూడా పబ్లిక్ పాల్గొంటున్నారు…కానీ ఔట్ బ్రేక్ అవ్వలేదని తెలిపారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా అటువంటి ఔట్ బ్రేక్ అవ్వకపోవడం అదృష్టమన్నారు. మనం ఇక్కడ తీసుకున్న జాగ్రత్తల వల్ల బాగా కట్టడి చేయగలిగామని తెలిపారు. విద్యాసంస్థల ఓపెనింగ్ కి సంబంధించి సీఎం KCR దాదాపుగా 4గంటల పాటు వివిధ విభాగలతో సమావేశం అయ్యారు.. జాగ్రత్తలపై అనేక సూచనలు చేశారని పేర్కొన్నారు. పంచాయితీ రాజ్ శాఖ, ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ, విద్యాశాఖ, ఇలా ఎక్కడికక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి కూలంకషంగా చర్చించారని తెలిపారు.

ఇప్పటికే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కి వాక్సినేషన్ పూర్తి అయ్యిందన్నారు. ప్రైవేట్ విద్య సంస్థలో కూడా వాక్సినేషన్ పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్కూల్స్ లో అన్ని కోవిడ్ నిబంధనలు ఫాలో అవుతూ క్లాసులు నిర్వహించాలని సూచించామని తెలిపారు. థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. విద్యార్థుల్లో మానసిక ఆందోళనలు పెరుగుతున్నాయని తెలిపారు. ఎలక్ట్రానిక్ పరికరాలకు ఎడిక్ట్ అవుతున్నారని.. అందుకే అన్ని గమనించిన తరువాతే స్కూల్స్ రీ ఓపెన్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురవ్వకుండా పిల్లల్ని స్కూల్స్ కి పంపించాలని సూచించారు. ప్రత్యేక్ష బోధనతోనే ఉపయోగం ఉంటుందన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తరువాతే ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చారని తెలిపారు.

థర్డ్ వేవ్ అంటే వేరే ఒక కొత్త వేరియంట్ వస్తే తప్పితే రాదన్నారు. ప్రజలు పూర్తి స్థాయిలో నిబంధనలు ఫాలో అవుతూ స్వీయ నియంత్రణలో ఉంటే జాగ్రత్తలు తీసుకుంటే కొత్త వేవ్ వచ్చే అవకాశాలు తక్కువని తెలిపారు. రాజకీయ నాయకులు ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని తమ కార్యక్రమాలను పెట్టుకోవాలని సూచించారు. ఏదైనా స్కూల్ లో 5కేసుల కన్నా ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదు అయితే మొత్తం స్కూల్ ని ఐసోలెట్ చేస్తామని పేర్కొన్నారు.

ఇప్పటివరకు కోటి 80లక్షల వాక్సినేషన్ పూర్తి అయ్యిందన్నారు. కోటి వ్యాక్సిన్ డోసులకు 80 రోజులు పడితే 80లక్షలు పూర్తి చేసుకోడానికి 60రోజులు పట్టిందని చెప్పారు. గ్రేటర్ లో చాలా బాగా వాక్సినేషన్ జరుగుతోందని కొనియాడారు. మొబైల్ వ్యాక్సినేషన్ లో భాగంగా 5లక్షలకు పైగా వ్యాక్సిన్ అందించామని వెల్లడించారు. కాలనీలలో చాలావరకు వ్యాక్సిన్ పూర్తి అయ్యిందన్నారు. GHMC లో 95శాతం పూర్తి అయ్యిందని తెలిపారు. ఇంకా వ్యాక్సిన్ భయం ఉన్నవాళ్లు అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. కేంద్రం నుంచి కూడా వ్యాక్సిన్ డోసులు కావాల్సినన్ని అందజేస్తున్నారని..రాష్ట్రంలో దసరా వరకు మొదటి డోస్ పూర్తి అవుతుందన్నారు.

ఒకటి రెండు నెలల్లో భారత్ బయోటెక్ వారి వ్యాక్సిన్ 2సంవత్సరాలు పైబడిన వారికి కూడా రాబోతుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సినిమా హాల్స్, మాల్స్, ఇతర పబ్లిక్ ప్లేస్ లో వ్యాక్సిన్ వేసుకున్నట్టు సర్టిఫికెట్ చూపించాల్సి వస్తోందన్నారు. కాబట్టి ప్రతిఒక్కరు అర్హులు అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు. కేరళలో వ్యాధి బారిన పడని వారి సంఖ్య ఎక్కువగా ఉందని సమాచారం…అందుకే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయని అంటున్నారని పేర్కొన్నారు.