Ganesh Idols : పాతబస్తీ నుండి ట్యాంక్ బండ్ కు వెయ్యి వినాయక విగ్రహాలు

హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం కోసం రాత్రి నుంచి భారీగా గణపయ్యలు తరలివస్తున్నారు. పాతబస్తీ నుండి ట్యాంక్ బ్యాండ్ కు వెయ్యి వినాయక విగ్రహాలు బయలు దేరనున్నాయి.

Ganesh Idols : పాతబస్తీ నుండి ట్యాంక్ బండ్ కు వెయ్యి వినాయక విగ్రహాలు

Ganesh (3)

Thousands of Ganesh idols : తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాయి. భాగ్యనగరంలో అన్ని దారులు సాగర్‌ వైపే సాగుతున్నాయి. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం కోసం రాత్రి నుంచి భారీగా గణపయ్యలు తరలివస్తున్నారు. ట్యాంక్ బండ్ కు భారీగా గణనాథులు చేరుకుంటున్నాయి. పాతబస్తీ నుండి ట్యాంక్ బండ్ కు వెయ్యి వినాయక విగ్రహాలు బయలు దేరనున్నాయి. అడుగడుగునా పోలీస్ పహారా కాస్తున్నారు.

లా అండ్ ఆర్డర్, రిజర్వ్ అండ్ టాస్క్ ఫోర్స్, క్రైమ్, మఫ్టీ, షీ టీమ్స్, రాపిడ్ యాక్షన్, ఆక్టోపస్, షాడో టీమ్స్, గ్రే హౌండ్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ పోలీస్ బలగాలతో పహారా కాస్తున్నారు. పాతబస్తీ లో 1.75 వేల సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంచారు. బషీర్ బాగ్ సీపీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణ చేయనున్నారు.

Khairatabad Ganesh : నిమజ్జనానికి తయారైన ఖైరతాబాద్ గణేష్

ఫలక్ నుమా బ్రిడ్జ్ నిర్మాణ దశ పూర్తి అయింది. నిన్న సాయంత్రం ట్రయిల్ రన్ చేశారు. 10 అడుగులు పైన ఉన్న విగ్రహాల ద్వారా జీహెచ్ ఎంసీ, పోలీసులు ట్రయిల్ రన్ చేశారు. బాలాపూర్ గణేష్ ఫలక్ నుమా బ్రిడ్జ్ వచ్చే అవకాశం ఉంది. మరో రూట్ లాల్ దర్వాజ్ మీదుగా బాలా పూర్ విగ్రహాన్ని సాగర తీరానికి తరలించే అవకాశం ఉంది.

ఇక సుప్రీంకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు నిమజ్జనానికి ముమ్మర ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం కోసం తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరుగకుండా జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. శోభాయాత్ర జరిగే మార్గంలో అడుగడుగునా 4 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

Ganesh Immersion : ట్యాంక్ బండ్ కు చేరుకుంటున్న గణనాథులు..భారీగా ట్రాఫిక్ జామ్

విగ్రహాల నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్‌ పరిసరాలలో 40 క్రేన్‌లు, గ్రేటర్‌లోని అన్ని చెరువులు, కుంటల వద్ద మొత్తం 320 క్రేన్‌లను అందుబాటులో ఉంచామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ప్రతీ కేన్‌ వద్ద ఒక పోలీసు అధికారిని నియమించడంతో పాటు ప్రతి విగ్రహం వెంట నిమజ్జన యాత్రలో ఒక అధికారి ఉండనున్నారు. నిమజ్జనం దృష్ట్యా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్‌ను మళ్లించారు. ట్యాంక్‌బండ్‌ పరిధిలో 32 మంది స్విమ్మర్లను సైతం అందుబాటులో ఉంచామని చెప్పారు.