VRAs Besieged Assembly : అసెంబ్లీ ముట్టడికి వీఆర్ఏలు ప్రయత్నం, పలువురు అరెస్టు

హైదరాబాద్ లో వీఆర్ఏలు కదం తొక్కారు. వేలాదిగా రాజధానికి తరలివచ్చారు. తమ సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ బాట పట్టారు. వేలాది మంది వీఆర్ఏలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. విడతల వారిగా 6 వేల మంది వీఆర్ఏలు అసెంబ్లీ ముట్టడికి వచ్చారు. ఇంతమంది వీఆర్ఏలు వస్తారని ఇంటెలిజెన్స్ పసిగట్టలేకపోయింది. కాగా, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది.

VRAs Besieged Assembly : అసెంబ్లీ ముట్టడికి వీఆర్ఏలు ప్రయత్నం, పలువురు అరెస్టు

VRAs Besieged Assembly

VRAs Besieged Assembly : హైదరాబాద్ లో వీఆర్ఏలు కదం తొక్కారు. వేలాదిగా రాజధానికి తరలివచ్చారు. తమ సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ బాట పట్టారు. వేలాది మంది వీఆర్ఏలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. విడతల వారిగా 6 వేల మంది వీఆర్ఏలు అసెంబ్లీ ముట్టడికి వచ్చారు. ఇంతమంది వీఆర్ఏలు వస్తారని ఇంటెలిజెన్స్ పసిగట్టలేకపోయింది. కాగా, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. వీఆర్ఏల అసెంబ్లీ ముట్టడిని ఇంటెలిజెన్స్ పసిగట్టలేకపోయింది. మూడు రోజుల ముందే వీఆర్ఏలు హైదరాబాద్ కు చేరుకున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల బంధువుల ఇళ్లలో మూడు రోజుల నుంచి మకాం వేశారు.

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏలు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన వందలాది మంది వీఆర్ఏలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. అసెంబ్లీని ముట్టడించేందుకు వీఆర్ఏలు వస్తున్నట్లుగా సమాచారం రావడంతో వెంటనే పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ నుంచి ప్రగతి భవన్ వరకు భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న రోడ్లు మొత్తం బ్లాక్ చేశారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నాంపల్లి నుంచి అసెంబ్లీ వైపు వెళ్లే వాహనాలను దారి మళ్ళించారు.

Mahabubabad CI : కాల్చిపారేస్తా.. వీఆర్ఏలకు సీఐ బెదిరింపులు

అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన వీఆర్ఏలు కేసీఆర్ డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. వందలాదిగా తరలివచ్చిన ఉద్యోగులను నిలువరించడం పోలీసులకు కష్టంగా మారింది. ఈ క్రమంలో ఇందిరా పార్క్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ దగ్గరి నుంచి పెద్ద ఎత్తున వస్తున్న 200 మంది వీఆర్ఏలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ఈ కార్యక్రమం ముసుగులో ఎలాంటి అవాంఛనీ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అయితే ఈ ఘటనల నేపథ్యంలో అసెంబ్లీ సమీప ప్రాంతాల్లో షాపులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో వ్యాపారులు మండిపడుతున్నారు.

సోమవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో ఆగ్రహానికి గురైన వీఆర్ఏలు.. ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. గత అసెంబ్లీ సమావేశంలో పే స్కేల్ ప్రకారం జీతం ఇస్తామని చెప్పిన కేసీఆర్.. మాట తప్పారంటూ ఆరోపిస్తున్నారు. పే స్కేల్ విధానం లేకుండా ఇస్తున్న జీతం కుటుంబాన్ని పోషించేందుకు సరిపోవడం లేదని.. నెలకు రూ.12వేల లోపు జీతంతో భార్యాబిడ్డలను ఎలా పోషించాలని ప్రశ్నించారు. వీఆర్ఏలను ఇతర శాఖల్లో భర్తీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని.. కానీ ఇంతవరకు ఆ ప్రక్రియ మొదలుపెట్టలేదని పేర్కొన్నారు.

VRA: వీఆర్ఏతో స్వీపర్ పనులు చేయిస్తున్న అధికారులు

సీఎం, మంత్రిపై తమకు నమ్మకం ఉందని వీఆర్ఏ జేఏసీ నేతలు అంటున్నారు. ఈ నెల 20 వరకు తమ హామీలను నెరవేరుస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ నెల 20 వరకు శాంతియుతంగా ఉద్యమం కొనసాగిస్తామని చెప్పారు. వీఆర్వో వ్యవస్థ రద్దయ్యాక జాబ్ చార్జ్ లో లేని విధులను చేయించారని వాపోయారు. వీఆర్ఏలకు ప్రమోషన్లు లేకుండా పోయాయని పేర్కొన్నారు. వీఆర్ఏలకు ఏ రాజకీయ పార్టీ మద్దతు లేదన్నారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్లే సమ్మెకు దిగాల్సి వచ్చిందని తెలిపారు. వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నామని పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరిస్తేనే సమ్మె విరమిస్తామని తేల్చి చెప్పారు.