HCA: హెచ్‌సీఏ మాజీ అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ముగ్గురు మాజీ అధికారులను యాంటీ కరప్షన్ బ్యూరో సోమవారం అరెస్టు చేసింది. వారిపై కేసులు నమోదు చేసి స్పెషల్ కోర్టు ముందు హాజరుపరచనుంది. కొద్ది రోజుల క్రితం హెచ్‌సీఏ మాజీ అధికారులైన యాదగిరి, శ్రీనివాస్, దేవరాజ్ లకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది.

HCA: హెచ్‌సీఏ మాజీ అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ

Hca Arrest (1)

HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ముగ్గురు మాజీ అధికారులను యాంటీ కరప్షన్ బ్యూరో సోమవారం అరెస్టు చేసింది. వారిపై కేసులు నమోదు చేసి స్పెషల్ కోర్టు ముందు హాజరుపరచనుంది. కొద్ది రోజుల క్రితం హెచ్‌సీఏ మాజీ అధికారులైన యాదగిరి, శ్రీనివాస్, దేవరాజ్ లకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. అసోసియేషన్ లో ఇర్రెగ్యూలరిటీస్ పై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వడానికి హాజరుకాలేదు.

దీంతో కోర్టు డైరక్షన్స్ అనుసరిస్తూ.. నాన్ బెయిలబుల్ వారెంట్ ను విధించి.. ఆ తర్వాత బెయిల్ అనుమతులిచ్చారు. క్లబ్ సెక్రటరీలలో ఒకరైన సీ బాబూరావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ తో కోర్టులో విచారణ జరగనుంది.

మొత్తానికి తొమ్మిది మందిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు, హెచ్‌సీఏ సెక్రటరీ ఆర్ విజయానంద్ లు కూడా అందులో ఉన్నారు. కేవలం యాదగిరి, శ్రీనివాస్, దేవరాజ్ లపై మాత్రమే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చి… విచారణకు హాజరైన వారిని విడిచిపెట్టింది.