Manuguru Singareni : మణుగూరు సింగరేణి ఓసీ-2లో ప్రమాదం.. ముగ్గురు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గని-2లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.

Manuguru Singareni : మణుగూరు సింగరేణి ఓసీ-2లో ప్రమాదం.. ముగ్గురు మృతి

Singareni

Three killed in accident at singareni : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గని-2లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. బొలెరో వాహనంపైకి డంపర్ ఎక్కడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. మృతులు పాషా, సాగర్, డ్రైవర్ వెంకన్నగా గుర్తించారు. వీరిలో ఇద్దరు పర్మినెంట్ ఉద్యోగులు ఉన్నారు. ఇక ఇప్పటివరకు ఈ ఘటనపై సింగరేణి అధికారులు స్పందించలేదు.

బొలెరో వాహనం నడుపుతున్న ఇద్దరు పర్మినెంట్ ఉద్యోగులు, ఒక డ్రైవర్ ఉన్న వెహికల్ పై ఒక డంపర్ ఎక్కడంతో ప్రమాదం జరిగింది. దీంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. సింగరేణి ఉద్యోగుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. డ్రైవర్ చూసుకోకుండా డంపర్ ను వెహికిల్ పై ఎక్కించాడు. సింగరేణి లోపలికి మీడియాను అనుమతించడం లేదు. సమాధానం కూడా చెప్పే పరిస్థితి లేకపోవడంతో స్థానికులు, కొంతమంది సిబ్బంది ఆందోళనకు దిగారు.

ఇప్పటికే మృతదేహాలను మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై స్పందించకుండా ఉన్న అధికారుల తీరుపై స్థానిక ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలోనూ చోటు చేసుకున్నాయి. సింగరేణిలో అధికారుల తీరు ఏ మాత్రం మారడం లేదు. డంపర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఫలితంగానే ముగ్గురు ప్రాణాలు కూడా గాలిలో కలిసి పోయాయని స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎవరు చనిపోయారు? ఎలా చనిపోయారు ? అని అధికారులు నిర్ధారించకపోవడంతో స్థానిక ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే డంపర్ డ్రైవర్ ఉన్నారో అతనిపై కూడా చర్యలు తీసుకోవాలని స్థానికులు చెబుతున్నారు.