TSPSC: తెలంగాణలో మరో మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల

మున్సిపల్ శాఖ, విద్యా శాఖ, కళాశాల విద్యాశాఖలో నోటిఫికేషన్లు జారీ చేసింది. మున్సిపల్ శాఖకు సంబంధించి 78 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో 64 సీనియర్ అకౌంటెంట్, 13 జూనియర్ అకౌంటెంట్, ఒక అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.

TSPSC: తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ల పర్వం కొనసాగుతోంది. ప్రభుత్వం వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఇప్పటికే గ్రూప్-2, గ్రూప్-4 సహా పలు జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసిన టీఎస్‌పీఎస్‌సీ శనివారం మరో మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసింది.

Twitter: ఇంటి నుంచే టాయిలెట్ పేపర్స్ తెచ్చుకుంటున్న ట్విట్టర్ స్టాఫ్.. మస్క్ చర్యలతో ఉద్యోగుల తిప్పలు

మున్సిపల్ శాఖ, విద్యా శాఖ, కళాశాల విద్యాశాఖలో నోటిఫికేషన్లు జారీ చేసింది. మున్సిపల్ శాఖకు సంబంధించి 78 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో 64 సీనియర్ అకౌంటెంట్, 13 జూనియర్ అకౌంటెంట్, ఒక అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి జనవరి 20 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. విద్యాశాఖలోనూ లైబ్రేరియన్ పోస్టుల్ని భర్తీ చేయనుంది టీఎస్‌పీఎస్‌సీ. మొత్తం 71 లైబ్రేరియన్ పోస్టుల్ని భర్తీ చేస్తారు. ఇందులో ఇంటర్ కమిషనరేట్ పరిధిలో 40 లైబ్రేరియన్ పోస్టులు, టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగంలో 31 లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించి జనవరి 21 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

GST Return: ఐటీఆర్, జీఎస్‌టీ రిటర్న్‌కు నేడే ఆఖరి రోజు… కీలకాంశాలివే

ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. కళాశాల విద్యాశాఖలో 544 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లు, పీడీలు, లైబ్రేరియన్ల పోస్టులను దీనిద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి జనవరి 31 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్ష వచ్చే ఏడాది మే లేదా జూన్‌లో జరిగే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు