Nagar Kurnool : స్నేహితుడి పెళ్లికి వెళ్లొస్తుండగా విషాదం.. నాగర్ కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం-ముగ్గురు మృతి

మహబూబాబాద్, నల్లొండ జిల్లాలకు చెందిన యువతీయువకులు నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో స్నేహితుడి వివాహ వేడుకకు వెళ్లారు. వివాహానికి హాజరై తిరిగి కారులో వస్తుండగా ప్రమాదం జరిగింది.

Nagar Kurnool : స్నేహితుడి పెళ్లికి వెళ్లొస్తుండగా విషాదం.. నాగర్ కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం-ముగ్గురు మృతి

Car Accident

Three killed in a road accident : స్నేహితుడి వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా విషాదం నెలకొంది. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన కల్వకుర్తి మండలం మార్చాల సమీపంలో జరిగింది. కల్వర్ట్ ను ఢీకొట్టి కారు బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, కారు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల్లోకి ప్రకారం… మహబూబాబాద్, నల్లొండ జిల్లాలకు చెందిన యువతీయువకులు నిన్న కారులో నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలో స్నేహితుడి వివాహ వేడుకకు వెళ్లారు. వివాహానికి హాజరై ఇవాళ తిరిగి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గంమధ్యలో కల్వకుర్తి మండలం మార్చాల సమీపంలో కారు ఒక్కసారిగా కల్వర్ట్ ను ఢీకొట్టింది. దీంతో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

Plane Crash Lorry : హైవే రోడ్డుపై ట్రక్కును ఢీకొట్టిన విమానం.. పైలట్ మృతి

మృతుల్లో ఇద్దరు యువతులు ఉన్నారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు కిరణ్మయి, శిరీష, అరవింద్ గా గుర్తించారు. అరవింద్ ముందు సీటులో, ఇద్దరు అమ్మాయిలు వెనుక సీటులో కూర్చున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక కారులో మద్యం బాటిళ్లు లభ్యం కావడంతో డ్రంకన్ డ్రైవ్ వల్లే యాక్సిడెంట్ అయినట్లు తెలుస్తోంది.

వెల్దండ మండలం కేంద్రంలో స్నేహితుని వివాహానికి వెళ్లిన వీరు.. నిన్న పార్టీ చేసుకుని రాత్రి ఆలస్యం కావడంతో ఇవాళ తెల్లవారుజామున తిరుగుప్రయాణం కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మద్యం బాటిళ్లు, కారు డ్రైవర్ వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.