చాక్లెట్లు ఇస్తానంటే వెళ్లిన మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం

చాక్లెట్లు ఇస్తానంటే వెళ్లిన మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం

Three Years Old Girl Raped

Three years old girl raped  : ఆడపుట్టుకలపై జరుగుతున్న అత్యాచారాలకు ఏమాత్రం అడ్డుకట్ట పడటంలేదు. ఎన్ని చట్టాలు వచ్చినా అఘాయిత్యాలు జరుగుతునే ఉన్నాయి. పసిమొగ్గల నుంచి కాటికి కాళ్లు చాపుకున్న వృద్ధ మహిళల వరకూ అత్యాచారాలు జరుగుతునే ఉన్నాయి. అటువంటి దారుణమే జరిగింది తెలంగాణాలోనే సిరిసిల్లా మున్సిపల్ పరిదిలో. చాక్లెట్లు ఇస్తానని ఆశ పెట్టి మూడేళ్ల చిన్నారిపై దారుణంగా అత్యాచారం చేసిన ఘటన సిరిసిల్ల మున్సిపల్‌ పరిధి భూపతినగర్‌లో ఆదివారం (ఏప్రిల్ 4,2021) జరిగింది.

భూపతినగర్‌కు చెందిన బూర్ల చంద్రశేఖర్‌ ఎదురింట్లో ఉంటున్న మూడేళ్ల చిన్నారిపై కన్నేశాడు. పసిబిడ్డ అని కూడా చూడకుండా చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. పసిమొగ్గ ఆ కామాంధుడి దురాగతానికి తట్టుకోలేకపోయింది. తనకు ఏం జరుగుతుందో కూడా తెలియని ఆ చిన్నారి కేకలు వేసింది. బిడ్డ కేకలు విన్న తల్లి ఆత్రంగా పరుగెత్తుకుంటూ వచ్చింది.

అప్పటికే ఆ కామాంధుడి కామానికి బలైన ఆ చిన్నారి తీవ్ర రక్తస్రావంతో ఉండటం చూసిన ఆ తల్లి తల్లడిల్లిపోయింది. చుట్టు పక్కల వారికి అదే విషయం చెప్పింది. నా బిడ్డను ఆగం చేశాడీ దుర్మార్గుడు అంటూ వాపోయింది. వెంటనే స్థానికుల సహాయంతో బిడ్డను ఆసుపత్రికి తరలించింది. చిన్నారిని పరీక్షించిన డాక్టర్లు అత్యాచారం జరిగిందని దృవీకరించారు.

దీంతో వెంటనే చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం చిన్నారి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. నిందితుడు చంద్రశేఖర్‌ ప్రవర్తనతో పాటు, గతంలో నేరారోపణలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు సోమవారం ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. స్థానికులతో మాట్లాడి నివేదిక తయారు చేశారు.