Ts covid-19: తెలంగాణలో కొత్తగా కరోనా కేసులు ఎన్నంటే?

తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా భారీగా కొవిడ్ కేసులు నమోదవుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోనూ కొవిడ్ కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 205మందికి కొత్తగా కొవిడ్ సోకింది.

Ts covid-19: తెలంగాణలో కొత్తగా కరోనా కేసులు ఎన్నంటే?

Covid

Ts covid-19: తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా భారీగా కొవిడ్ కేసులు నమోదవుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోనూ కొవిడ్ కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 205మందికి కొత్తగా కొవిడ్ సోకింది. 21,070 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలను వైద్యాధికారులు నిర్వహించారు. అయితే కొవిడ్ చికిత్స పొందుతున్న 63 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 99.31శాతం ఉంది.

ఇదిలా ఉంటే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపిన లెక్కల ప్రకారం.. ఒక్క హైదరాబాద్ లోనే 132 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 39, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 10 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇక సంగారెడ్డి జిల్లాలో 9, మంచిర్యాల జిల్లాలో మూడు, అదిలాబాద్, నల్గొండ, పెద్దపల్లి, యాద్రాద్రి భవనగిరి జిల్లాలో రెండు చొప్పున, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్ నగర్, హనుమకొండ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Corona Fourth Wave Tension : దేశంలో మళ్లీ కరోనా అలజడి.. కమ్ముకుంటున్న ఫోర్త్‌వేవ్ భయాలు

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 1,401కి చేరింది. కొవిడ్ ఉధృతి పెరిగే అవకాశం ఉందని, ప్రతిఒక్కరు ఎవరికివారు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఇప్పటికే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు.