Group-1 Application: నేటితో గ్రూప్-1 దరఖాస్తులకు చివరి గడువు.. రాత్రి ఎన్ని గంటల వరకు అంటే..

తెలంగాణ గ్రూప్-1 పోస్టులకు సంబంధించి దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. మొత్తం 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 26న టీఎస్‌పీఎస్సీ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మే 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ చేపట్టింది.

Group-1 Application: నేటితో గ్రూప్-1 దరఖాస్తులకు చివరి గడువు.. రాత్రి ఎన్ని గంటల వరకు అంటే..

Gropu 1

Group-1 Application: తెలంగాణ గ్రూప్-1 పోస్టులకు సంబంధించి దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. మొత్తం 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 26న టీఎస్‌పీఎస్సీ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మే 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ చేపట్టింది. శుక్రవారం నాటికి 3,63,974 మంది అభ్యర్థులు గ్రూప్-1కు దరఖాస్తు చేశారు. కొత్తగా 1,90,163 మంది అభ్యర్థులు ఓటీఆర్ నమోదు చేసుకున్నారు. 3,83,319 మంది ఓటీఆర్ ను ఎడిట్ చేసుకున్నారు. అయితే దరఖాస్తుల స్వీకరణకు నేటితో గడువు ముగియనుండటంతో చివరి రోజు భారీగా అభ్యర్థులు గ్రూప్ -1 ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకొనే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Group-1 notification: తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల

గ్రూప్-1 ఉద్యోగాల కోసం మే31 అర్థరాత్రి వరకు దరఖాస్తులు చేసుకొనేందుకు టీఎస్‌పీఎస్సీ గడువు విధించింది. మే31 నాటికి కేవలం 3,48,095 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఫీజు చెల్లింపు సంబంధిత సమస్యల వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయిన పలువురు అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువు పొడిగించినట్లు టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. జూన్ 4వ తేదీ వరకు గ్రూప్ -1 పోస్టులకు అభ్యర్థులు దాఖలు చేసుకొనే అవకాశం కల్పించింది. దీంతో శనివారం అర్థరాత్రి 11.59 నిమిషాల వరకు దరఖాస్తులను అధికారులు స్వీకరించనున్నారు. ఇదిలా ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో 2011లో 312 పోస్టులతో వెలువడిన గ్రూప్‌-1 ప్రకటనకు 3 లక్షల మందికిపైగా దరఖాస్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా విడుదలైన గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. శనివారం రాత్రి వరకు గ్రూప్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకొనే వారి సంఖ్య 4లక్షలకుపైగా చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.