Samata Kumbh Brahmotsavam : నేటి నుంచి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో సమతా కుంభ్ బ్రహ్మోత్సవాలు ..

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో  నేటి నుంచి ఈనెల 12 వరకు సమతా కుంభ్ -2023 బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి సర్వం సన్నద్ధమైంది. ఈ పన్నెండు రోజులు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో ప్రతీరోజూ ఆథ్యాత్మిక శోభ వెల్లివెరియనుంది.

Samata Kumbh Brahmotsavam : నేటి నుంచి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో సమతా కుంభ్ బ్రహ్మోత్సవాలు ..

Samata Kumbh Brahmotsavam

Samata Kumbh Brahmotsavam : సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో నేటి నుంచి 108 దివ్యదేశాల బ్రహ్మోత్సవ సరంభం మొదలవుతుంది. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామిజీ ఆధ్వర్యంలో సమతా కుంభ్-2023 వేడుకలు ఉదయం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు చినజీయర్ స్వామి పర్యవేక్షణలో సువర్ణమూర్తి భగవద్రామానుజులకు ఉత్సవారంభ స్నపనంతో వేడుకలు ప్రారంభమవుతాయి. నేటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు ఈ ఆథ్యాత్మిక పండుగ కొనసాగనుంది. ఈ వేడుకలను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

Statue Of Equality : ముచ్చింతల్‌‌కు వెళుతున్నారా ? అయితే మీ కోసమే

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో  నేటి నుంచి ఈనెల 12 వరకు సమతా కుంభ్ -2023 బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి సర్వం సన్నద్ధమైంది. ఈ పన్నెండు రోజులు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో ప్రతీరోజూ ఆథ్యాత్మిక శోభ వెల్లివెరియనుంది. తొలిసారి జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలు.. ఇకనుంచి ప్రతీయేటా ఇదే పేరుతో బ్రహ్మండోత్సవం కనువిందు చేయనుంది. ఉదయం విశ్వక్సేన వీధిశోధన, సాయంత్రం అంకురారోపణ ఇలా ప్రతీ ఘట్టంతో ఆ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ఆథ్మాత్మిక శోభను సంతరించుకోనుంది.

 

సమతా కుంభ్ -2023 బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు ఉదయం 10.30 గంటలకు త్రిదండి రామానుజ చినజీయర్ స్వామివారి పర్యవేక్షణలో సువర్ణమూర్తి భగవద్రామానుజులకు ఉత్సవారంభ స్నపనంతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విశ్వక్సేన వీధి శోధన, మధ్యాహ్నం 1.30 గంటలకు తీర్థ ప్రసాద గోష్ఠిొ, సాయంత్రం 5 గంటల నుంచి 5.45 గంటల వరకు సామూహిక విష్ణు సహస్రనామస్తోత్ర పారాయణం, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు వేదికపై అంకురార్పణ వైనతేయ ప్రతిష్ఠ, తీర్థ ప్రసాద గోష్టి వంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి.