Revant Reddy : కేంద్రమంత్రి అమిత్ షాకు రేవంత్ రెడ్డి తొమ్మిది ప్రశ్నలు

మోసానికి బీజేపీ, టీఆర్ఎస్ కవల పిల్లలు అని ఎద్దేవా చేశారు. తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు మోదీ క్షమాఫన చెప్పాలని డిమాండ్ చేశారు. రామాయణం సర్క్యూట్ ఎక్స్ ప్రెస్ లో భద్రాద్రి రాముడికి చోటు ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు.

Revant Reddy : కేంద్రమంత్రి అమిత్ షాకు రేవంత్ రెడ్డి తొమ్మిది ప్రశ్నలు

Revanth (4)

Revant Reddy : కేంద్రమంత్రి అమిత్ షాకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తొమ్మిది ప్రశ్నలు సంధించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు’.. అనే సామెత మీ ప్రభుత్వానికి అతికినట్లు సరిపోతుందని రేవంత్ ఎద్దేవా చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీని విస్మరించారని పేర్కొన్నారు. రైతుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లైందని వాపోయారు.

రాష్ట్రానికి రావాల్సిన హక్కులను బీజేపీ, టీఆర్ఎస్ తుంగలో తొక్కాయని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం వేల కోట్ల దోపిడీకి పాల్పిడితే చోద్యం చూస్తున్నారని అన్నారు. ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ చేస్తోన్న మీ చీకటి సంబంధం ప్రజలకు అర్థమైందన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు అంటూ మాట తప్పారని విమర్శించారు.

Revanth Reddy : బీజేపీ, టీఆర్ఎస్ రైతులను మోసం చేస్తున్నాయి : రేవంత్ రెడ్డి

మోసానికి బీజేపీ, టీఆర్ఎస్ కవల పిల్లలు అని ఎద్దేవా చేశారు. తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు మోదీ క్షమాఫన చెప్పాలని డిమాండ్ చేశారు. రామాయణం సర్క్యూట్ ఎక్స్ ప్రెస్ లో భద్రాద్రి రాముడికి చోటు ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఓపికను అమాయకత్వం అనుకోవద్దన్నారు.