Revanth Reddy : రియల్ ఎస్టేట్ మాఫియా కోసమే 111 జీవో రద్దు డ్రామా : రేవంత్ రెడ్డి

హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఇచ్చిన జీవో 69 చెల్లదన్నారు. రియల్ ఎస్టేట్ మాఫియా కోసమే 111 జీవో రద్దు డ్రామా ఆడుతున్నారని విమర్శించారు.

Revanth Reddy : రియల్ ఎస్టేట్ మాఫియా కోసమే 111 జీవో రద్దు డ్రామా : రేవంత్ రెడ్డి

Revanth

Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వం 111 జీవో పరిధిలోని గ్రామాల్లో నిబంధనలు ఎత్తివేసిన విషయం తెలిసిందే. 111జీవో ఆంక్షలు ఎత్తివేతపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. 111 జీవో ఆంక్షలు ఎత్తివేస్తూ ఇచ్చిన జీవో 69 చెల్లదన్నారు. హైకోర్టు స్టే ఆర్డర్ ను ట్వీట్ కు ట్యాగ్ చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు వద్దని 111జీవోపై 2007 జులై 16న హైకోర్టు స్టే విధించిందని గుర్తు చేశారు. పరివాహక ప్రాంతాన్ని 10కిలో మీటర్ల నుంచి 500 మీటర్లకు తగ్గించాలని చెప్పిందని తెలిపారు. హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఇచ్చిన జీవో 69 చెల్లదన్నారు. రియల్ ఎస్టేట్ మాఫియా కోసమే 111 జీవో రద్దు డ్రామా ఆడుతున్నారని విమర్శించారు.

111 జీవో పరిధిలోని గ్రామాల్లో నిబంధనలు ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో 84 గ్రామాలకు 111 జీవో నిబంధనల నుంచి విముక్తి లభించింది. జంట జలాశయాలు కలుషితం కాకుండా సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్‌ శివారులోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్, శంషాబాద్​మండలాలు పూర్తిగా.. వికారాబాద్ జిల్లాలోని శంకర్​పల్లి, చేవెళ్ల, షాద్​నగర్, షాబాద్​ మండలాల్లోని కొన్ని గ్రామాలు కలిపి ఏకంగా 84 గ్రామాలు ఈ జీవో పరిధిలోకి వస్తాయి. కొన్ని దశాబ్దాలుగా ఈ గ్రామాల ప్రజలు ట్రిపుల్ వన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

Telangana Govt : 111 జీవో పరిధిలోని గ్రామాల్లో నిబంధనలు ఎత్తివేత

ఇప్పటికే దీనిపై తీవ్ర కసరత్తు చేసిన తెలంగాణ సర్కార్… చివరికి జీవో నెంబర్‌ 111 ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ట్రిపుల్ వన్ జీవో రద్దుపై సీఎఎస్ నేతృత్వంలో కమిటి కూడా వేసింది తెలంగాణ ప్రభుత్వం. కాలుష్య నియంత్రణ మండలి, అటవీశాఖ అధికారులతో కలిసి కమిటిని ఏర్పాటు చేసింది. ఎట్టి పరిస్థితుల్లో మూసీ నది, ఈసా నది, ఆ రెండు జలాశయాలు కలుషితం కాకుండా గ్రీన్‌జోన్స్ డిక్లేర్ చేస్తూ… మాస్టర్ ప్లాన్ అమలు చేస్తూ జీవో ఇంప్లిమెంట్ చేయాలని ఆదేశించింది.

హైదరాబాద్ పట్టణానికి తాగు నీరందించే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ను కాపాడేందుకు 1996లో అప్పటి ప్రభుత్వం జీవో 111ను తీసుకువచ్చింది. ఈ జీవో పరిధిలో నిర్మాణాలు చేయడంపై నిషేధం విధించింది. వ్యవసాయం తప్ప ఏ రంగానికి ఇక్కడ భూమి కేటాయింపు చేయకూడదు. కానీ, ట్రిపుల్ వన్ జీవో ఎత్తి వేస్తామంటూ ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికల హామీలు ఇచ్చాయి రాజకీయ పార్టీలు. దీంతో ట్రిపుల్ వన్ జీరో పరిధిలో పెద్ద ఎత్తున భూ లావాదేవీలు జరిగాయి. బడా పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు చిన్నాపెద్ద అంతా ట్రిపుల్ వన్ జీవో పరిధిలో భారీగా పెట్టుబడులు పెట్టారు. గతంలో చాలా మంది కోర్టును సైతం ఆశ్రయించారు. అయినప్పటికి ఫలితం దక్కలేదు.