Revanth Letter PM Modi : ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..తెలంగాణ ప్రజలంటే ఎందుకంత చులకన?

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో అవినీతిపై సీబీఐ విచారణ జరిపించడానికి ఇబ్బందేంటని ప్రశ్నించారు. పామూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.

Revanth Letter PM Modi : ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..తెలంగాణ ప్రజలంటే ఎందుకంత చులకన?

Revanth Letter

Revanth Letter PM Modi : తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన హీట్ పెంచుతోంది. ప్రధాని మోదీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తొమ్మిది పాయింట్లతో కూడిన లేఖ రాశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయడం లేదన్నారు. తెలంగాణ ప్రజలంటే ఎందుకు అంత చులకన అని ప్రశ్నించారు. పార్లమెంట్ లో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు మోదీ క్షమాపణ చెప్పాలన్నారు.

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో అవినీతిపై సీబీఐ విచారణ జరిపించడానికి ఇబ్బందేంటని ప్రశ్నించారు. పామూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ చీకట స్నేహం మిమ్మల్ని ఆపుతుందన్నారు. పసుపు బోర్డు హామీ నెరవేరుస్తారా లేదా? నిలదీశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న ఎంపీ అరవింద్ హామీ ఏమైందని అడిగారు. మీ దృష్టిలో తెలంగాణకు అంత అప్రధాన్యత దేనికని ప్రశ్నించారు.

Revant Reddy : కేంద్రమంత్రి అమిత్ షాకు రేవంత్ రెడ్డి తొమ్మిది ప్రశ్నలు

కేసీఆర్ అవినీతికి మీరే కంచెగా ఉంటున్నారా? అని అడిగారు. తెలంగాణ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. నైనీ కోల్ మైన్స్ అవినీతి టెంటర్ల విషయంలో చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని మహారాష్ట్రకు తరలించినా టీఆర్ఎస్ ఎందుకు నోరు మెదపదని ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు.