Revanth Reddy : పేపర్ లీకేజీలో ఇద్దరు వ్యక్తులకే ప్రమేయముందని ఎలా చెప్పగలరు? రేవంత్

పేపర్ లీకేజీలో ఇద్దరు వ్యక్తులకే ప్రమేయం ఉందని ఎలా చెబుతారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ ఏమైనా ప్రత్యేక విచారణ అధికారా అని పేర్కొన్నారు. చంచల్ గూడ జైలు సందర్శకుల వివరాలు బయటపెట్టాలన్నారు.

Revanth Reddy : పేపర్ లీకేజీలో ఇద్దరు వ్యక్తులకే ప్రమేయముందని ఎలా చెప్పగలరు? రేవంత్

Revanth Reddy

Revanth Reddy : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనంగా మారింది. పేపర్ లీకేజీలో ఇద్దరు వ్యక్తులకే ప్రమేయం ఉందని ఎలా చెబుతారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ ఏమైనా ప్రత్యేక విచారణ అధికారా అని పేర్కొన్నారు. చంచల్ గూడ జైలు సందర్శకుల వివరాలు బయటపెట్టాలన్నారు. మార్చి 13-18 మధ్య ఎవరెవరు జైలును సందర్శించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.

పేపర్ లీక్ తో తనకు సంబంధం లేదని కేటీఆర్ వితండవాదం చేస్తున్నారని పేర్కొన్నారు. చంచల్ గూడ జైలు సీసీ టీవీ ఫుటేజ్ బయటపెట్టాలన్నారు. 20 మంది అక్రమంగా పరీక్ష రాశారని పేర్కొన్నారు. 2015 నుంచి పేపర్ లీకేజీ జరుగుతోందన్నారు. కేసు విచారణ సక్రమంగా జరగడం లేదని చెప్పారు.

Revanth Reddy : కల్వకుంట్ల అవినీతికి బలై పోయిన నందిపేట సెజ్ : రేవంత్ రెడ్డి

కేటీఆర్ ఆఫీస్ నుంచి మొత్తం వ్యవహారం జరిగిందని ఆరోపించారు. గ్రూప్1లో వంద మార్కులకుపైగా వచ్చిన వారందరి వివరాలను ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్ చేశారు. పెద్దల పేర్లు చెబితే నిందితులను ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరించారని పేర్కొన్నారు.

టీఎస్పీఎస్సీలో పని చేస్తూ పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతారని ప్రశ్నించారు. కేటీఆర్ ఏపీ తిరుపతి..ఏ-2 రాజశేఖర్ ఇద్దరిది పక్క పక్క గ్రామాలన్నారు. తిరుపతి వల్లే రాజశేఖర్ కు ఉద్యోగం వచ్చిందని తెలిపారు. కేటీఆర్ ఆఫీస్ నుంచే ఇదంతా జరిగిందని చెప్పారు.