Dalitha Girijana Dandora sabha : రావిరాలలో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ నేడే

కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పధకానికి కౌంటర్ గా ....కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు నిర్వహిస్తోంది. 

Dalitha Girijana Dandora sabha : రావిరాలలో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ నేడే

Tpcc Chief Revanth Reddy

Dalitha Girijana Dandora : తెలంగాణ‌లో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పధకానికి కౌంటర్ గా ….టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో దళిత గిరిజన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని జరుగుతున్న మోసాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు నిర్వహిస్తోంది.  ఇంద్రవెల్లిలో జరిగిన సభ సక్సెస్ కావటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలో సభలు నిర్వహించాలని టీపీసీసీ ప్లాన్ చేసింది.

అందులోభాగంగా ఈరోజు ఇబ్రహీంపట్నంలో సభ ఉంటుందని మొదట టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. దానికి పోలీసులు అనుమతి నిరాకరించటం… ఇతర కారణాలతో సభను మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని రావిరాలకి షిఫ్టు చేశారు. సాయంత్రం 4గంటలకు ప్రారంభమయ్యే దళిత గిరిజన దండోరా సభ సక్సెస్ చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమయ్యాయి.

రావిరాల దండోరా సభను సక్సెస్ చేయడానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలకు PCC చీఫ్ రేవంత్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు.మల్కాజ్‌గిరి, చేవెళ్లతో పాటు భువనగిరి పార్లమెంట్ పరిధిలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు సభకు వచ్చేలా చూస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నేతలకు జనసమీకరణపై దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ఇంద్రవెల్లి కంటే రావిరాల దళిత, గిరిజన దండోరా విజయవంతం చేస్తానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు.

రావిరాల తర్వాత హుజూరాబాద్‌లోనే సీఎం నిర్వహించిన   ప్లేస్‌లోనే కాంగ్రెస్ దళిత, గిరిజన దండోరా మోగిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపడానికి దళిత, గిరిజన సభలతో ఒకటి మించిన మరో సభలను ఏర్పాటు చేయాలని  కాంగ్రెస్ పార్టీ నేతలు యోచిస్తున్నారు.

ఒక్కో సభపై అంచనాలను పెంచుతూ పార్టీ కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు.  ఈరోజు జరిగే సభలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ఆయన ఈనెల 21వరకు హైదరాబాద్ లోనే ఉండి పార్టీ నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గోనున్నారు.