రాష్ట్రంలో ఆందోళనలు చేసి…ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ రైతులను ఎందుకు కలవలేదు? టీఆర్ఎస్-బీజేపీ ఒకటేనన్న రేవంత్

రాష్ట్రంలో ఆందోళనలు చేసి…ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ రైతులను ఎందుకు కలవలేదు? టీఆర్ఎస్-బీజేపీ ఒకటేనన్న రేవంత్

tpcc working president తెలంగాణ ఫైర్ బ్రాండ్,మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్..బీజేపీకి సరెండర్ అయ్యారని రేవంత్ అన్నారు. టీఆర్ఎస్ కు అనుకూలంగా బీజేపీ నిర్ణయాలు తీసుకుంటోందని..బీజేపీకి అనుకూలంగా కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటారని 10టీవీ ఇంటర్వ్యూలో రేవంత్ అన్నారు. బీజేపీ-టీఆర్ఎస్ రెండూ ఒకటేనని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఏకైక పత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనని..బీజేపీ కాదని రేవంత్ తెలిపారు.

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేటీఆర్ సహా అనేకమంది మంత్రులు,ఎమ్మెల్యేలు రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ లో పాల్గొన్నారని..అయితే భారత్ బంద్ జరిగిన కొన్ని తర్వాత ఢిల్లీ వెళ్లిన కేసీఆర్..ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తోన్న రైతుల వద్దకు వెళ్లి వాళ్లను ఎందుకు పరామర్శించలేదని రేవంత్ ప్రశ్నించారు. 3 రోజులు ఢిల్లీలో ఉన్న కేసీఆర్ రైతుల వైపు కన్నెత్తి కూడా చూడలేదని అన్నారు. బీజేపీ నేతల చుట్టూ ప్రదిక్షణలు చేసి వారికి శాలువాలు కప్పిన కేసీఆర్..గజగజ వణికే చలిలో ఆందోళన చేస్తోన్న రైతులకు ఎందుకు గొంగళ్లు లేదా దుప్పట్లు ఇప్పిద్దామని కేసీఆర్ ఆలోచన చేయలేదని రేవంత్ అన్నారు.

రాష్ట్రంలో కానీ,దేశంలోకానీ ప్రాంతీయపార్టీలన్నీ 90శాతం బీజేపీ వైపే వెళ్లిపోతాయని రేవంత్ అన్నారు. ప్రాంతీయపార్టీలు చాలా ప్రమాదకరమని రేవంత్ అన్నారు. ప్రాంతీయపార్టీలలో ఒక వ్యక్తి యొక్క పరిపాలనలో తీసుకున్న నిర్ణయాల వల్ల అవినీతీ,అక్రమాలు,నిర్లక్ష్యంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలను అడ్డంబెట్టుకొని బీజేపీ ప్రాంతీయ పార్టీలను లొంగదీసుకుంటని అన్నారు. ప్రాంతీయపార్టీలు… అమిత్ షా,మోడీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకి లొంగిపోయి బీజేపీ తరపున ఉండాల్సిందే తప్ప వాళ్లకి వేరే ప్రత్యామ్నాయం లేదు.మార్గం లేదు అని రేవంత్ అన్నారు. జాతీయస్థాయిలో అయినా రాష్ట్ర స్థాయిలో అయినా బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ఒక్కటే అని రేంవత్ అన్నారు.

ఇక పీసీసీ రేసులో తాను ఉన్నట్లు రేవంత్ తెలిపారు. ఒకరిద్దరు సీనియర్లు మాత్రమే తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు. జానారెడ్డి,ఉత్తమ్ రెడ్డి,మధుయాష్కీ గౌడ్,భట్టి విక్రమార్క వంటి సీనియర్లు తనను వ్యతిరేకించట్లేదని సృష్టం చేశారు. త్వరలోనే తనను విమర్శించే ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం తనను మెచ్చుకోవచ్చు అని రేవంత్ వ్యాఖ్యానించారు. తన గురించి అన్నీ తెలిసే 2017లో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహఉల్ గాంధీ తనను పార్టీలో చేర్చుకున్నారని..ఆ సందర్భంగా మీకు పార్టీలో తగినంత గౌరవం లభిస్తుందని రాహుల్ తనతో అన్నారని రేవంత్ అన్నారు.

సంక్రాంతి లోపు పీసీసీ అధ్యక్షుడి పేరుని హైకమాండ్ ప్రకటించే అవకాశముందని రేవంత్ తెలిపారు. ఒకవేళ తనకు కాకుండా పీసీసీ పదవి వేరొకరి ఇచ్చినా కూడా తాను పార్టీ మారే ప్రశక్తే లేదని రేవంత్ సృష్టం చేశారు. 2018లో రాష్ట్రంలో మహాకూటమి ఓటమికి ఏ ఒక్కరిదో బాధ్యత కాదని..అందరిదీ సమిష్ఠి బాధ్యత అని రేవతంత్ తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలే తన బలం అని రేవంత్ అన్నారు. కార్యకర్త గుండె రగిలేలా ఏ పనీ చెయ్యనని తెలిపారు. భవిష్యత్తులో కాంగ్రెస్-కమ్యూనిస్టులు కూడా కలిచే అవకాశముందన్నారు.

ఇక, ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై రేవంత్ స్పందించారు. బీజేపీ గెలుపు గాలివాటం అన్నారు. బీజేపీకి నిర్మాణం లేదన్నారు. బీజేపీ అనేది పేపర్ టైగర్ అని అన్నారు. కొన్ని మీడియా సంస్థలు బీజేపీ ఉనికిని కాపాడుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ నిర్వీర్యం చేయడం వల్ల..కేసీఆర్ ను తిరస్కరించాలన్న నిర్ణయంతో విషప్రచారం చేసిన బీజేపీకి దుబ్బాకలో,జీహెచ్ఎంసీలో ప్రజలు ఓటు వేశారన్నారు. ఓటుకి నోటు కేసులో తాజాగా ముత్తయ్య స్టేట్మెంట్ పై కూడా రేవంత్ స్పందించారు. ఆయన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.