Somajiguda : లాక్ డౌన్ వేళ…చిన్నారుల ఆకలి తీర్చిన కానిస్టేబుల్..నెటిజన్ల ప్రశంసలు

అంకుల్..ఆకలి వేస్తోంది..అన్నం పెట్టవా..అని చిన్నారుల మాట వినగానే..ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ మనస్సు చలించిపోయింది. వెంటనే తాను ఇంటి నుంచి తెచ్చుకున్న టిఫిన్ ఆ ఇద్దరు చిన్నారులకు పెట్టేశాడు.

Somajiguda : లాక్ డౌన్ వేళ…చిన్నారుల ఆకలి తీర్చిన కానిస్టేబుల్..నెటిజన్ల ప్రశంసలు

Trafic

Traffic Constable : అంకుల్..ఆకలి వేస్తోంది..అన్నం పెట్టవా..అని చిన్నారుల మాట వినగానే..ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ మనస్సు చలించిపోయింది. వెంటనే తాను ఇంటి నుంచి తెచ్చుకున్న టిఫిన్ ఆ ఇద్దరు చిన్నారులకు పెట్టేశాడు. అన్నం చూడగానే..ఆ చిన్నారుల్లో ఎంతో ఆనందం కలిగింది. ఆతృతంగా తినేశారు. ఈ ఘటన పంజాగుట్టలో చోటు చేసుకుంది. లాక్ డౌన్ వేళ ఆ చిన్నారుల ఆకలి తీర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

పంజాగుట్ట ట్రాఫిక్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఎస్‌.మహేశ్‌ కుమార్‌ సోమవారం రాత్రి సోమాజిగూడ రోడ్డు మీదుగా వెళుతున్నాడు. ఫుట్ పాత్ పై ఇద్దరు పిల్లలు అన్నం కావాలంటూ అడుగుతున్నారు. వెంటనే తన బైక్ ను ఆపి..బ్యాగ్‌లో ఉన్న టిఫిన్‌ బాక్సులోని అన్నం తీసి ఆ పిల్లలకు తినిపించాడు. ఈ దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి.

చికెన్ అంటూ..పిల్లలు తినేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహేశ్‌ను కొనియాడుతూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. Telangana State Police ట్విట్టర్ వేదికగా పోస్టు చేసింది. హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ ఆ కానిస్టేబుల్‌ను మంగళవారం కార్యాలయానికి పిలిపించి జ్ఞాపిక ఇచ్చి అభినందనలు తెలిపారు.

Read More : Cyclone : ఇండియాకు తుఫాన్‌ల బెడద..