Traffic Diversion: సర్కారు వారి పాట ప్రీ రిలీజ్: హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు

మహేష్ అభిమానులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున..ట్రాఫిక్ అంతరాయం ఏర్పడవచ్చన్న ముందుచూపుతో యూసుఫ్‌గూడ పరిసర ప్రాంతాల్లో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు

Traffic Diversion: సర్కారు వారి పాట ప్రీ రిలీజ్: హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు

Traffic

Traffic Diversion: మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ప్రీ రిలీజ్ వేడుక శనివారం హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని 1వ TSSP బెటాలియన్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్నారు. ఈకార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో మహేష్ అభిమానులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున..ట్రాఫిక్ అంతరాయం ఏర్పడవచ్చన్న ముందుచూపుతో యూసుఫ్‌గూడ పరిసర ప్రాంతాల్లో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా పలు మార్గాలలో ఆంక్షలు విధించారు. ఈమేరకు తెలంగాణ పోలీస్ జాయింట్ కమీషనర్ కార్యాలయం అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ ఉంటుందని అంచనా వేసిన పోలీసులు పరిస్థితులను బట్టి ట్రాఫిక్ మళ్లించారు.

Also Read:Sarkaru Vaari Paata: SVP పాన్ ఇండియాగా ఎందుకు రిలీజ్ చేయడం లేదంటే?

మైత్రీవనం నుండి వచ్చే బస్సులు మరియు భారీ వాహనాలు యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ వైపు వెళ్ళేకూడదు. సవేరా ఫంక్షన్ హాల్ వద్ద కృష్ణకాంత్ పార్క్ – కళ్యాణ్ నగర్ వైపు మరియు సత్యసాయి నిగమాగమం – కమలాపురి కాలనీ – కృష్ణ నగర్ – జూబ్లీహిల్స్ వైపు వాహనాలను మళ్లించారు. జూబ్లీహిల్స్ నుండి వచ్చే బస్సులు మరియు భారీ వాహనాలు శ్రీనగర్ కాలనీ వద్ద సత్యసాయి నిగమాగమం వైపు వెళ్లాల్సి ఉంటుంది. సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చే వారు తమ వాహనాలను మహమూద్ ఫంక్షన్ ప్యాలెస్ (కార్ పార్కింగ్ మాత్రమే 70 కార్లు), సవేరా ఫంక్షన్ హాల్ ఎదురుగా ఓపెన్ గ్రౌండ్ 4 వీలర్ మరియు 2 వీలర్ పార్కింగ్ (200 కార్లు మరియు 700 ద్విచక్ర వాహనాలు), ప్రభుత్వ పాఠశాల, యూసుఫ్‌గూడ 2 వీలర్ పార్కింగ్ కోసం మాత్రమే (200 ద్విచక్ర వాహనాలు), యూసుఫ్‌గూడ మెట్రో స్టేషన్ పార్కింగ్ 2 వీలర్ పార్కింగ్ కోసం మాత్రమే (500 ద్విచక్ర వాహనాలు) వద్ద పార్కింగ్ చేయాలనీ పోలీసులు సూచించారు.

Also read:Rahul in Warangal: అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ: ప్రకటించిన రాహుల్ గాంధీ

ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యే వ్యక్తులందరూ తప్పనిసరిగా నిర్వాహకులు జారీ చేసిన పాస్‌లను కలిగి ఉండాలి మరియు అలాంటి పాస్‌లలో హోలోగ్రాం (HOLOGRAM) మరియు సీరియల్ నంబర్ కలిగి ఉండాలి. పాస్‌లు లేని ఆహ్వానితులు బెటాలియన్ గ్రౌండ్లోకి అనుమతించబడరని పోలీసు అధికారులు పేర్కొన్నారు. నగరవాసులు ట్రాఫిక్ ఆంక్షలను గమనించి తమ తమ గమ్యస్థానాలు చేరేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను తీసుకోనవలసినదని పోలీసులు సూచించారు.

Also read:F3: టాలీవుడ్ సీక్వెల్స్ అన్నీ ప్లాపులే.. F3 సెంటిమెంటును అధిగమిస్తుందా?