Sunday Special : ట్యాంక్ బండ్ పై అమల్లోకి ఆంక్షలు

హైదరాబాద్ సికింద్రాబాద్ జంటనగరాలను కలిపే ట్యాంక్ బండ్ పై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఇక నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం వాహనాలను అనుమతించరు.

Sunday Special : ట్యాంక్ బండ్ పై అమల్లోకి ఆంక్షలు

Sunday Special

Sunday Special :  హైదరాబాద్ సికింద్రాబాద్ జంటనగరాలను కలిపే ట్యాంక్ బండ్ పై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఇక నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం వాహనాలను అనుమతించరు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నారు. ఈ సమయంలో ట్యాంక్ బండ్ పై సందర్శకులను మాత్రమే అనుమతిస్తున్నారు.

హైదరాబాద్ లో ఎంజాయ్ చెయ్యాలంటే తొలుత గుర్తొచ్చేది ట్యాంక్ బండ్ నే.. ట్యాంక్ బండ్ పై నడుచుకుంటే వెళ్తుంటే ఆ మజానే వేరు. ఓ వైపు హుస్సేన్ సాగర్ అందాలు, మరోవైపు విగ్రహాలను తిలకిస్తూ.. పులకించి పోతారు పర్యాటకులు. ఇకపై ట్యాంక్ బండ్ పై వాహనాల శబ్దం లేకుండా పర్యాటకులు ప్రశాంతంగా ఉండేలా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక పార్కింగ్ కోసం మొత్తం 8 పాయింట్స్ ఏర్పాటు చేశారు. హిమాయత్ నగర్, నాంపల్లి, పంజాగుట్ట నుంచి వచ్చేవారికోసం లేపాక్షి మార్గం, ఆదర్శ్ నగర్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వాటర్స్, లుంబినీ పార్క్ ఎదురుగా ఉన్న స్థలం, అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ వచ్చే పర్యాటకులు ఈ నాలుగు పార్కింగ్ ప్రాంతాల్లో తమ వాహనాలు నిలుపవచ్చు. సికింద్రాబాద్ నుంచి వచ్చే వారికి ప్రత్యేకంగా నాలుగు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. బుద్దభవన్, టీబీఆర్ మిల్స్.. సెయిలింగ్ ప్రాంతంలో పార్కింగ్ కు ఏర్పాట్లు చేశారు.

కొద్దీ రోజుల క్రితం ఓ సిటిజన్ కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ ట్యాంక్ బండ్ ట్రాఫిక్ గురించి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై స్పందించిన ఐటీ మంత్రి కేటీఆర్.. ట్రాఫిక్ విషయమై నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ని ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ మళ్లించేందుకు ఏర్పాటు చేయాలనీ తెలిపారు. మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ అంశాలు విధించారు. ఇవి ప్రతి ఆదివారం సాయంత్రం 5 నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.