Traffic restrictions in Hyderabad: హైదరాబాద్ లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు: పోలీసులు
హైదరాబాద్ లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు చెప్పారు. రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. శాసన సభ, శాసన మండలిని ఉద్దేశించి రేపు మధ్యాహ్నం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. గత సమావేశాల కొనసాగింపుగా ఈ సమావేశాలు ఉన్నాయి.

Traffic restrictions in Hyderabad: హైదరాబాద్ లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు చెప్పారు. రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. శాసన సభ, శాసన మండలిని ఉద్దేశించి రేపు మధ్యాహ్నం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. గత సమావేశాల కొనసాగింపుగా ఈ సమావేశాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. రేపు ఉదయం 9 గంటల నుంచి, మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ ను మళ్లిస్తామని పోలీసులు చెప్పారు. ఖైరతాబాద్-బషీర్ బాగ్-రవీంద్ర భారతి, మాసాబ్ ట్యాంక్, లక్డీకాపూల్, నాంపల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని చెప్పారు.
అంతేగాక, అవసరమైతే ఇతర పలు ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ ను మళ్లిస్తామని తెలిపారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కొన్ని నెలల్లో జరగాల్సి ఉన్న నేపథ్యంలో జరుగుతున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Minister KTR: మన దేశంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయి: కేటీఆర్ వ్యాఖ్యలు