Khairatabad Traffic Restrictions : నేటి నుంచి ఖైరతాబాద్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Khairatabad Traffic Restrictions : నేటి నుంచి ఖైరతాబాద్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Khairatabad Traffic Restrictions

హైదరాబాద్‌లో వినయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్‌ గణేశుడు ఈ ఏడాది ఆదిశేషుడి నీడలో పంచముఖ మహాలక్ష్మి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. గణనాథుడిని దర్శించుకోవడానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఖైరతాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. నవరాత్రి ఉత్సవాలు ముగిసేవరకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు. భక్తుల వాహనాల కోసం పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేశారు.

ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ 67 సంవత్సరాల చరిత్రలోనే తొలిసారిగా మట్టి గణపతిని ప్రతిష్టించారు. 50 అడుగుల ఎత్తు, 22 అడుగుల వెడల్పుతో మట్టి గణపతిని ప్రతిష్టించడం ఓ రికార్డు. ఉప మండపాల్లో 22 అడుగుల ఎత్తులో స్వామి వారి కుడివైపు షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి, ఎడమవైపు త్రిశక్తి మహాగాయత్రి దేవిని ప్రతిష్టించారు. అన్ని విగ్రహాలను పూర్తిగా మట్టితో రూపొందించడం విశేషం.

Ganesh Bhavan Mahabubnagar : రాష్ట్రంలో తొలి గణేష్ భవన్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఖైరతాబాద్‌ గణేశుడిని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దర్శించుకున్నారు. గణనాథుని తొలి పూజలో పాల్గొన్నారు. అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూ ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఖైరతాబాద్‌ వినాయకుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. అందరిని ఐకమత్యంగా ఉంచేదే గణేష్ ఉత్సవాలు అని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.