Boy Dies In SwimmingPool : బాలుడిని బలితీసుకున్న స్విమ్మింగ్ పూల్.. నాగోల్‌లో తీవ్ర విషాదం

సమ్మర్ లో సరదాగా స్విమ్మింగ్ కు వెళ్లడమే ఆ బాలుడి పాలిట శాపంగా మారింది. స్మిమ్మింగ్ పూల్ నిర్వాహకుల నిర్లక్ష్యం ప్రాణం తీసింది.

Boy Dies In SwimmingPool : బాలుడిని బలితీసుకున్న స్విమ్మింగ్ పూల్.. నాగోల్‌లో తీవ్ర విషాదం

Boy Dies In Swimmingpool

Boy Dies In SwimmingPool : హైదరాబాద్ నాగోల్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్ నిర్వహకుల నిర్లక్ష్యం ఓ బాలుడిని బలి తీసుకుంది. సమ్మర్ లో సరదాగా స్విమ్మింగ్ కు వెళ్లడమే ఆ బాలుడి పాలిట శాపంగా మారింది. స్మిమ్మింగ్ పూల్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో పదేళ్లకే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. నాగోల్ సమతాపురి కాలనీలోని బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్ లో ఈతకు వెళ్లిన బాలుడు మృతి చెందాడు.

లింగంపల్లికి చెందిన విశ్వనాధ్, రేణుక దంపతుల పెద్ద కుమారుడు మనోజ్ (10) వేసవి సెలవులు కావడంతో అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. ఇంటికి దగ్గరలోనే స్విమ్మింగ్ పూల్ ఉండటంతో.. సరదాగా ఈత కొట్టాలని అనుకున్నాడు. బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్ కి వెళ్లాడు. అయితే, స్విమ్మింగ్ పూల్ లో మునిగి చనిపోయాడు.

మనోజ్ మృతితో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా, ఈత కొలనులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడమే మనోజ్ మృతికి కారణం అని బంధువులు ఆరోపిస్తున్నారు. మనోజ్ ఈత కొడుతుంటే.. దగ్గరుండి చూసుకోవాల్సిన ట్రైనర్.. గదిలో రెస్ట్ తీసుకుంటున్నాడు. అంతేకాదు, నిర్వాహకులు మనోజ్ కి కనీసం స్విమ్మింగ్ ట్యూబ్ కూడా ఇవ్వకపోవడం దారుణం అంటున్నారు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా బాలుడి మృతికి కారణమైన స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న చైతన్యపురి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మనోజ్ మృతికి కారణమైన స్విమ్మింగ్ పూల్ ఓనర్ అశోక్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.