Trains cancelled: పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్.. పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఇరువైపులా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మార్గంలో సికింద్రాబాద్ వచ్చే లేదా సికింద్రాబాద్ నుంచి వెళ్లే రైళ్లలో కొన్నింటిని పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రైల్వే శాఖ రద్దు చేసింది.

Trains cancelled: పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్.. పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

Trains cancelled: విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం ఉదయం ఘట్‌కేసర్ పరిధిలో పట్టాలు తప్పిన సంగతి తెలిసిందే. నాలుగు బోగీలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. అయితే, ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు.

KA Paul: గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ తీసినందుకే బీబీసీపై ఐటీ రైడ్స్: కేఏ పాల్

ఈ నేపథ్యంలో పట్టాల మరమ్మతులు జరుగుతున్నాయి. ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఇరువైపులా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మార్గంలో సికింద్రాబాద్ వచ్చే లేదా సికింద్రాబాద్ నుంచి వెళ్లే రైళ్లలో కొన్నింటిని పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రైల్వే శాఖ రద్దు చేసింది. రద్దైన రైళ్ల వివరాలు.. కాచిగూడ-నడికుడె, నడికుడె-కాచిగూడ, సికింద్రాబాద్-వరంగల్, వరంగల్-హైదరాబాద్, సికింద్రాబాద్-గుంటూర్, గుంటూర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-రేపల్లె.

MP Komatireddy: ఠాక్రేతో కోమటిరెడ్డి భేటీ.. ‘హంగ్’ వ్యాఖ్యలపై కోమటిరెడ్డిని ప్రశ్నించిన ఠాక్రే

పాక్షికంగా రద్దైన రైళ్లు… సిర్పూర్ కాగజ్ నగర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-గుంటూర్, విజయవాడ-సికింద్రాబాద్, సికింద్రాబాద్-విజయవాడ, భద్రాచలం-సికింద్రాబాద్, గుంటూర్-వికారాబాద్, వికారాబాద్-గుంటూర్, వరంగల్-సికింద్రాబాద్, మిర్యాలగూడ-కాచిగూడ, కాచిగూడ-మిర్యాలగూడ, గుంటూర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్. రైళ్ల రద్దుకు సంబంధించిన సమాచారాన్ని రైల్వే శాఖ ప్రయాణికులు తెలియజేసింది.