Trains Cancelled: బల్లార్షా నుంచి సికింద్రాబాద్‌కు మధ్య రైళ్ల సర్వీసులు రద్దు

బల్లార్షా నుంచి సికింద్రాబాద్ రైలు ప్రయాణికులకు తంటాలు వచ్చాయి. జమ్మికుంట-ఉప్పల్ రైల్వేస్టేషన్ మధ్య 3వ లైన్ పనులు జరుగుతుండటమే ఇందుకు కారణం.

Trains Cancelled: బల్లార్షా నుంచి సికింద్రాబాద్‌కు మధ్య రైళ్ల సర్వీసులు రద్దు

Book Train Tickets How To Book Train Tickets Through Uts App, Follow These Steps (1)

Trains Cancelled: బల్లార్షా నుంచి సికింద్రాబాద్ రైలు ప్రయాణికులకు తంటాలు వచ్చాయి. జమ్మికుంట-ఉప్పల్ రైల్వేస్టేషన్ మధ్య 3వ లైన్ పనులు జరుగుతుండటమే ఇందుకు కారణం. ఈ పనుల్లో భాగంగా రైలు మార్గానికి అంతరాయం కలుగుతుండటంతో భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ ,సిరుపూర్ కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్ ,రామగిరి ప్యాసింజర్, సింగరేణి ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు.

ఒకట్రెండు రోజులు కాదు.. జులై 20 వ తేదీ వరకు రైళ్ల సర్వీసును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు రైల్వే అధికారులు. అంతేకాకుండా మరో 12 రైళ్ల వెళ్లేందుకు మార్గాన్ని డైవర్ట్ చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

ఈ మార్గం మధ్యలో ప్రయాణించేందుకు హైదరాబాదు-సిర్‌పూర్‌ కాగజ్‌నగర్‌ల మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఒక్కటే ఉండటంతో ప్రయాణికులు తంటాలు పడుతున్నారు.

Read Also: 37రైళ్లు రద్దు చేసిన రైల్వే శాఖ