Minister Ajay: టీఎస్ఆర్‌టీసీకి పూర్వ వైభవం దిశగా అడుగులు

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకొనే దిశగా అడుగులు వేస్తుందని అన్నారు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

Minister Ajay: టీఎస్ఆర్‌టీసీకి పూర్వ వైభవం దిశగా అడుగులు

Puvvada Ajay

Minister Ajay: తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకొనే దిశగా అడుగులు వేస్తుందని అన్నారు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో ఆర్టీసీలో అనేక సంస్కరణలతో ఆదాయం పెరుగుతుందని చెప్పారు మంత్రి అజయ్.

కరోనా సంక్షోభ సమయంలో వివిధ మార్గాల్లో నిలిపివేసిన బస్సులను క్రమంగా పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు మంత్రి అజయ్. సెప్టెంబర్‌ 3వ తేదీ నుంచి నవంబర్‌ 24వ తేదీ వరకు 359 బస్సులను పునరుద్ధరించినట్లు చెప్పారు. మరోవైపు ప్రజల అవసరాలకు తగ్గట్టుగా కొత్త రూట్లలో 151 బస్సులను రంగంలోకి దింపింది. ఈ 510 బస్సుల ద్వారా రోజూ 1,934 ట్రిప్పులు నడుపుతున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

సాధారణంగా రాష్ట్రంలో రోజూ 9వేల 5వందల బస్సులు సగటున 80వేల ట్రిప్పుల వరకు తిరుగుతూ ఉంటాయని తెలిపారు మంత్రి అజయ్. ప్రయాణికుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి వారికి మరింత చేరువయ్యేందుకు టీఎస్‌ఆర్టీసీ ప్రయత్నిస్తుందని అన్నారు అజయ్. బస్సులు కావాలంటూ వచ్చే వినతులపై ప్రత్యేక దృష్టి సారించడంతో అనుకున్న ఫలితాలు కనబడుతున్నాయని అన్నారు పువ్వాడ అజయ్ కుమార్.

Omicron : ఒమిక్రాన్ ముప్పు.. రాష్ట్రాలకు కేంద్రం గైడ్‌లైన్స్