Troffic Restrictions : గణేష్ నిమజ్జనం..సెప్టెంబర్ 19న హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్‌ పోలీసులు వెల్లడించారు.

Troffic Restrictions : గణేష్ నిమజ్జనం..సెప్టెంబర్ 19న హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic (1)

Troffic restrictions in Hyderabad : గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్‌ పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్‌ ఆంక్షల గురించి తెలుసుకునేందుకు కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఎవరికైనా సందేహాలుంటే 040-27852482, 9490598985, 9010303626 నంబర్లలో సంప్రధిం చవచ్చని అధికారులు పేర్కొన్నారు.

గణేశుని విగ్రహాలను తరలించే వాహనాలకు ప్రత్యేకంగా కలర్‌ కోడింగ్ ఏర్పాటు చేశారు. దీని ఆధారంగా ట్రాఫిక్‌ పోలీసులు రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేశారు. ట్రాఫిక్‌ రద్దీని గూగుల్‌ మ్యాప్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయనున్నారు. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి సంబంధించి జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. నిమజ్జనం నేపథ్యంలో నగరంలో పలుచోట్ల ఆర్టీసీ బస్సులను దారి మళ్లించనున్నారు. అదేవిధంగా జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసి బస్సులను నగర శివార్లకే పరిమితం చేయనున్నారు.

Metro Trains : గణేశ్ నిమజ్జనం సందర్భంగా రేపు అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు

నల్లగొండ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎల్బీనగర్‌, వరంగల్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు ఉప్పల్‌, దేవరకొండ నుంచి వచ్చే వాహనాలు సాగర్‌ రింగ్‌రోడ్డు, ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి వచ్చే వాహనాలను ఆరాంఘర్‌‌ వద్ద నిలిపివేయనున్నారు. ఇక అంతర్‌ రాష్ట్ర, జిల్లాల లారీల ప్రవేశంపై శనివారం అర్ధరాత్రి నుంచే నిషేధం విధించనున్నారు.

తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న వినాయకుడు రేపు గంగమ్మ ఒడికి చేరుకోనున్నాడు. ఇక సుప్రీంకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు నిమజ్జనానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలి ఉండడంతో నిమజ్జన ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. నిమజ్జనం కోసం తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు. శోభాయాత్ర జరిగే మార్గంలో అడుగడుగునా 4 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

విగ్రహాల నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్‌ పరిసరాలలో 40 క్రేన్‌లు, గ్రేటర్‌లోని అన్ని చెరువులు, కుంటల వద్ద మొత్తం 320 క్రేన్‌లను అందుబాటులో ఉంచామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. ప్రతీ కేన్‌ వద్ద ఒక పోలీసు అధికారిని నియమించడంతో పాటు ప్రతి విగ్రహం వెంట నిమజ్జన యాత్రలో ఒక అధికారి ఉండనున్నారు. నిమజ్జనం దృష్ట్యా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. ట్యాంక్‌బండ్‌ పరిధిలో 32 మంది స్విమ్మర్లను సైతం అందుబాటులో ఉంచామని చెప్పారు.

Tank Bund : గణేష్ నిమజ్జనం, ట్యాంక్ బండ్‌‌పై 40 క్రేన్లు..ప్రత్యేక నిఘా

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా జనరేటర్లను సిద్ధంగా ఉంచనున్నట్లు తెలిపారు. ఇక హుస్సేన్‌ సాగర్‌ పరిధిలో 2, 600 లైట్లను ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు తాగునీరు అందిచేందుకు 30 లక్షల వాటర్‌ ప్యాకెట్లను సిద్ధం చేయనున్నారు. అవసరమైన ప్రాంతాలకు వాటర్‌ ట్యాంకర్‌ల ద్వారా నీటి సరఫరాకు చర్యలు తీసుకోనున్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు 8 వేల 700 మంది సిబ్బంది మూడు షిఫ్ట్‌లలో నిరంతరం విధులు నిర్వహిస్తారు.

శోభాయాత్రలో లక్షలాది మంది పాల్గొనే అవకాశం ఉండడంతో ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగే విధంగా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 19 వేల మంది వివిధ స్థాయి పోలీస్‌ సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. నిమజ్జనం సందర్భంగా భారీగా తరలిరానున్న భక్తజన సందోహం కోసం గ్రేటర్‌ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఉదయం నుంచి నిమజ్జన వేడుకలు పూర్తయ్యే వరకు 565 ప్రత్యేక బస్సులను నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. బస్సుల నిర్వహణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.