TRS-BRS : మధ్యాహ్నం 1.20 గంటలకు బీఆర్ఎస్ ఆవిర్భావ సభ..జెండాను ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్

తెలంగాణ ఉద్యమ పార్టీగా అంకురించి టీఆర్ఎస్ ఇకపై బీఆర్ఎస్ గా కొనసాగనుంది. దీనికి సంబంధించి ఈరోజు జెండాను ఆవిష్కరించనున్నారు సీఎం కేసీఆర్. దీంట్లో భాగంగా మధ్యాహ్నం 1.20 గంటలకు బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్ జెండాను ఆవిష్కరించనున్నారు.

TRS-BRS : మధ్యాహ్నం 1.20 గంటలకు బీఆర్ఎస్ ఆవిర్భావ సభ..జెండాను ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్

TRS,BRS,ECI approves party,CM KCR, BRS flag,

TRS-BRS : తెలంగాణ ఉద్యమ పార్టీగా అంకురించి టీఆర్ఎస్ ఇకపై బీఆర్ఎస్ గా కొనసాగనుంది. దీనికి సంబంధించి ఈరోజు జెండాను ఆవిష్కరించనున్నారు సీఎం కేసీఆర్. దీంట్లో భాగంగా శుక్రవారం (డిసెంబర్ 9,2022)మధ్యాహ్నం 1.20 గంటలకు బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం అజెండా కూడా ప్రకటించనున్నారు. ఇకపై పూర్తిగా తెలంగాణ రాష్ట్ర సమితి భారత్ రాష్ట్ర సమితిగా మారనుంది. కొనసాగనుంది. పార్టీ పేరును మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ శుభ సందర్భాన్ని గులాబీ బాస్ తో పాటు పలువురు అగ్రనేతలు పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకోనున్నారు ఈ సభ వేదిక ద్వారా.

ఇక దీంతో 21 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్ ప్రస్థానం ముగిసి బీఆర్ఎస్ గా ఆవిర్భావం కానుంది. ఈక్రమంలో జెండాను ఆవిష్కరించిన తరువాత సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ జెండా..నినాదంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక బీఆర్ఎస్ ఆవిర్భావ సభ తరువాత నుంచి ఇక రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి ప్రయాణం ప్రారంభంకానుంది. బీఆర్ఎస్ పార్టీ జెండాపై ఇక తెలంగాణ మ్యాప్ కు బదులుగా భారతదేశం చిత్రపటం ఉండేలా జెండాను డిజైన్ చేశారు. ఈ సభలో సీఎం కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. బీజేపీకి ప్రత్యామ్నాయంగా కేసీఆర్ బీఆర్ఎస్ ను తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆకాంక్ష. దీనికి తగినట్లుగానే బీఆర్ఎస్ కార్యాచరణ ఉంటుంది అంటున్నారు పార్టీ శ్రేణులు.

ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం 1.20 గంటలకు దివ్య ముహూర్తంలో బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన లేఖపై కేసీఆర్ సంతకం చేయనున్నారు. ఆ మరుక్షణమే బీఆర్ఎస్ పార్టీ ఉనికిలోకి వస్తుంది. టీఆర్ఎస్ కనుమరుగు అవుతుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జెండాను కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. కార్యక్రమం అనంతరం పార్టీ కార్యాచరణపై కీలక నేతలతో కేసీఆర్ చర్చిస్తారు.

మరోవైపు ఈ మధ్యాహ్నం జరగనున్న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డీసీసీబీ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యలంతా హాజరుకానున్నారు. ముహూర్త సమయంలోగానే అందరూ తెలంగాణ భవన్ కు చేరుకోవాలని అందరికీ కేసీఆర్ పేరిట లేఖలు వెళ్లాయి. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా అవతరించనున్న నేపథ్యలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ బ్యానర్లు వెలిశాయి. పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.