TRS BJP Flexi War : మెట్రో పిల్లర్లకు ఉన్న సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలపై ప్రధాని మోదీ బ్యానర్లు

మెట్రో పిల్లర్లకు ఉన్న ఫ్లెక్సీలపై సీఎం కేసీఆర్ ఫొటో కనబడకుండా ప్రధాని మోదీ బ్యానర్లను అంటించారు. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి చైతన్యపురి వరకు ఇదే పరిస్థితి నెలకొంది.

TRS BJP Flexi War : మెట్రో పిల్లర్లకు ఉన్న సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలపై ప్రధాని మోదీ బ్యానర్లు
ad

TRS, BJP flexi war : హైదరాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీ ఫ్లెక్సీ వార్ మరింత ముదిరింది. బీజేపీకి అవకాశం లేకుండా టీఆర్ఎస్‌ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే…. వాటి స్థానంలోనే కమలనాథులు తమ పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. మెట్రో పిల్లర్లకు ఉన్న ఫ్లెక్సీలపై సీఎం కేసీఆర్ ఫొటో కనబడకుండా ప్రధాని మోదీ బ్యానర్లను అంటించారు. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి చైతన్యపురి వరకు ఇదే పరిస్థితి నెలకొంది. గడ్డి అన్నారం డివిజన్ కార్పొరేటర్‌ బద్దం ప్రేమ్‌ మహేశ్వర్‌రెడ్డి సూచనలతో కార్యకర్తలు తమ పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌లో ఫ్లెక్సీ వార్‌పై కూడా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. మొదట బీజేపీ నేతలే సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని.. ఆ తర్వాతే తాము బైబై మోదీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశామని చెప్పారు. బీజేపీనే ఫ్లెక్సీ గొడవలకు కారణమని మంత్రి తలసాని అన్నారు.

BJP Meetings : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక నిర్ణయాలు..తెలంగాణపై ప్రత్యేక తీర్మానం

మరోవైపు హైదరాబాద్‌లో బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీల వార్‌…గాంధీభవన్‌కు తాకింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఫ్లెక్సీ కట్టింది. మోదీ, కేసీఆర్‌ ఇద్దరూ నాటకరాయుళ్లు అంటూ గాంధీభవన్‌ వద్ద భారీ ఫ్లెక్సీ కనిపిస్తోంది. బైబై మోదీ, బైబై కేసీఆర్‌ అంటూ కాంగ్రెస్ నేతలు భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. మోదీ, కేసీఆర్‌ ఇచ్చిన హామీలను అమలు చేయలేదంటూ ఫ్లెక్సీలో రాశారు. దేశానికి మోదీ, తెలంగాణ కేసీఆర్‌ ఇద్దరూ వద్దు- మీ పాలన వద్దు – భవిష్యత్‌కి కాంగ్రెస్‌ ముద్దు అంటూ ప్రచారం చేస్తున్నారు.