Gellu Srinivas : ఇంట్లో సిలిండర్ కు దండం పెట్టుకుని పోలింగ్ బూత్ కు…ఓటు హక్కు వినియోగించుకున్న గెల్లు శ్రీనివాస్

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంట్లో సిలిండర్ కు దండం పెట్టుకుని పోలింగ్ బూత్ కు వెళ్లారు.

Gellu Srinivas : ఇంట్లో సిలిండర్ కు దండం పెట్టుకుని పోలింగ్ బూత్ కు…ఓటు హక్కు వినియోగించుకున్న గెల్లు శ్రీనివాస్

Gellu Srinivas

Huzurabad by-election polling : హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలిస్తున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంట్లో సిలిండర్ కు దండం పెట్టుకుని పోలింగ్ బూత్ కు వెళ్లారు. భార్యతో కలిసి నడుస్తూ పోలింగ్ బూత్ కు వెళ్లిన గెల్లు శ్రీనివాస్..తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మరోవైపు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కమలాపూర్‌లోని పోలింగ్‌ బూత్‌ నంబర్ 262లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గంలో పలు కేంద్రాలకు వెళ్లి పోలింగ్‌ సరళిని పరిశీలిస్తున్నారు. 90 శాతం ఓటింగ్‌ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ప్రజలు ఆత్మను ఆవిష్కరిస్తున్నారని పేర్కొన్నారు.

Huzurabad : భారీ పోలింగ్‌ దిశగా హుజూరాబాద్‌లో ఓటింగ్

ఆవేశం, ప్రేమను ఓట్ల రూపంలో చూపిస్తున్నారని తెలిపారు. 90 శాతం పైగా ఓటింగ్‌ జరిగేలా ఉందన్నారు. నియోజకవర్గ ఓటర్లు తనపై ప్రేమను ఓట్ల రూపంలో చూపిస్తున్నారన్న ఈటల..న్యాయం, ధర్మం ఈటల ధర్మం గెలుస్తుందన్నారు. అంతకుముందు ఈటల రాజేందర్‌.. కందుగులలోని పోలింగ్‌ బూత్‌ను విజిట్‌ చేశారు. పోలింగ్‌ను పరిశీలించారు. నియోజకవర్గ ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈటల రాజేందర్‌ విజ్ఞప్తి చేశారు.

హుజూరాబాద్‌లో ఓటింగ్ భారీగా సాగుతోంది. సాయంత్రంలోపు 90 శాతం ఓటింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఉద్రిక్తతల మధ్యే పోలింగ్ కొనసాగుతున్నప్పటికీ…ఓటర్లు భారీగా తరలివస్తున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.