Nagarjuna Sagar: జానారెడ్డి స్వగ్రామంలో ఉద్రిక్తత.. పోలీసులు లేకుంటే!

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భరత్ ప్రచారం కోసం కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఊరు అనుముల గ్రామానికి రాగ గ్రామస్తులు అతడిని అడ్డుకున్నారు.

Nagarjuna Sagar: జానారెడ్డి స్వగ్రామంలో ఉద్రిక్తత.. పోలీసులు లేకుంటే!

Nagarjuna Sagar

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భరత్ ప్రచారం కోసం కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఊరు అనుముల గ్రామానికి రాగ గ్రామస్తులు అతడిని అడ్డుకున్నారు. తమ గ్రామంలో ప్రచారం నిర్వహించవద్దని వెనుదిరిగి వెళ్లాలని కోరారు.

టీఆర్ఎస్ నాయకులు రావొద్దంటూ ఆందోళన చేపట్టారు. అంతకు ముందు అనుములకు చెందిన కాంగ్రెస్ నేత హాలియా వైపు కారులో వెళ్తుండగా మార్గమధ్యంలో ఎదురైన టీఆర్ఎస్ ప్రచార వాహన శ్రేణిలోని కొందరు జై తెలంగాణ అంటూ కాంగ్రెస్ నేతల కారు వద్దకు వచ్చి నినాదాలు చేశారు. దీంతో ఇబ్బందికి గురైన కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ నాయకుణ్ణి కారు వద్ద నినాదాలు చేస్తూ ఇబ్బందులకు గురిచేసిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ శ్రేణులు టీఆర్ఎస్ నాయకులు అనుముల గ్రామానికి రాకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య మాటల యుద్ధం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

ఈ క్రమంలోనే పోలీసులకు జానారెడ్డి కుమారుడికి మధ్య వాగ్వాదం జరిగింది. జానారెడ్డి కుమారుడు జయవీర్ రెడ్డి జీపు టాప్ పైకి ఎక్కి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు ఇరు పక్షాలకు సర్దిచెప్పి పంపారు.. నేడు (బుధవారం) కేసీఆర్ సభ ఉండటంతో టీఆర్ఎస్ శ్రేణులు విసృత ప్రచారం చేస్తూ అనుముల గ్రామానికి వెళ్లారు.