Telangana : వచ్చే 20 ఏళ్లు..అధికారంలో టీఆర్ఎస్

వచ్చే 20 ఏళ్లు కూడా టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు గులాబీ బాస్ కేసీఆర్. భవిష్యత్‌లో అన్ని వర్గాల వారికి దళితబంధు లాంటి పథకాలు అమలు చేస్తామన్నారు.

Telangana : వచ్చే 20 ఏళ్లు..అధికారంలో టీఆర్ఎస్

Cm Kcr

Chief Minister KCR : వచ్చే 20 ఏళ్లు కూడా టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు గులాబీ బాస్ కేసీఆర్. భవిష్యత్‌లో అన్ని వర్గాల వారికి దళితబంధు లాంటి పథకాలు అమలు చేస్తామన్నారు. సుదీర్ఘంగా జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో.. విపక్షాల విమర్శలు ఎలా తిప్పికొట్టాలి.. పార్టీ నిర్మాణం.. జిల్లాలకు కొత్త అధ్యక్షులు సహా పలు అంశాలపై కేసీఆర్ నేతలకు మార్గదర్శనం చేశారు.

Read More : Srisailam : శ్రీశైలంలో కొనసాగుతున్న శ్రావణ మాస పూజలు

అన్ని వర్గాలకు న్యాయం :-
అన్ని వర్గాలకంటే దళితులు వెనుకబడి ఉన్నందునే.. మొదట వారికి దళిత బంధు తీసుకొచ్చామని చెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్. భవిష్యత్‌లో బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలకు కూడా దళిత బంధు లాంటి స్కీమ్ తెస్తామని హామీ ఇచ్చారు. మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక వల్లే దళిత బంధు తెచ్చారం విపక్షాలు ఓ రేంజ్‌లో విమర్శలు చేస్తున్నాయి. ఆ విమర్శలను.. ఆరోపణలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ ఆదేశించారు. దళితబంధుపై ప్రజలను చైతన్యం చేయాలని సూచిస్తూనే.. అన్ని వర్గాలకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పారు.

Read More :Afghanistan G7 Meet : తాలిబ‌న్ల‌పై ఆంక్ష‌లు వ‌ర్కౌట్ కావు.. డ్రాగన్ సపోర్ట్..!

కమిటీల పునర్ నిర్మాణం :-
గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల పునర్నిర్మాణంపై ఈ సమావేశంలో చర్చించారు. నవంబర్ మొదటి వారంలో పార్టీ ప్లీనరీ వుంటుందని కేసీఆర్ చెప్పారు. వచ్చే నెల 2న ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. రాష్ట్ర కమిటీ సమావేశంలో ప్రధానంగా పార్టీ రెండు దశాబ్దాల ప్రస్థానంపై చర్చించింది టీఆర్ఎస్.
హుజరాబాద్ ఉప ఎన్నికపైనే ప్రధానంగా ఫోకస్ చేస్తారని అంతా భావించినా.. ఈ సమావేశంలో అసలు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రస్తావనే రాలేదన్నారు కేటీఆర్‌. దమ్ముంటే

Read More : University Of Hyderabad : మిస్టరీగా మారిన మౌనిక మృతి

దళిత బంధు అమలు చేయాలి :-
కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు అమలుచేయాలని సవాల్ విసిరారు. సెప్టెంబర్ 2 నాడే గ్రామ, వార్డు కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ తర్వాత జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక 32 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను సీఎం కేసీఆర్‌ అక్టోబరులో ప్రారంభిస్తారు. అక్టోబరు లేదా నవంబరులో పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది.