Gattu Vaman Rao : పుట్ట మధు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వామన్ రావు దంపతుల హత్య కేసులో రెండు రోజులుగా విచారణ జరుగుతోంది.

Gattu Vaman Rao : పుట్ట మధు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Peddpalli

TRS leader Putta Madhu : పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వామన్ రావు దంపతుల హత్య కేసులో రెండు రోజులుగా విచారణ జరుగుతోంది. రామగుండం కమిషనరేట్ లో 2 బృందాలుగా పోలీసులు విచారణ చేపడుతున్నారు. న్యాయవాది వామన్ రావు దంపతుల కేసులో రూ. 2 కోట్లు సుపారీ ఇచ్చినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు.

మధు కుటుంబీలకు బ్యాంకు లావాదేవీలపై ప్రస్తుతం దృష్టి సారించారు. పుట్ట మధు అనుచరులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. హత్య కేసులో పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిపై కేసు నమోదైంది. తాజా పరిణామాలతో మరికొందరిపై కేసులు నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మధు అరెస్టుకు ముందే పలువురు పోలీసులను బదిలీ చేశారు.

మరోవైపు..వామనరావు తండ్రి కిషన్ రావును మరోసారి పోలీసులు విచారించనున్నారు. విచారణకు రావాలని రామగుండం కమిషనరేట్ పోలీసులు ఆదేశించారు. దీంతో కమిషనరేట్ కార్యాలయానికి బయలుదేరారు. మంథని ప్రాంతానికి చెందిన పుట్ట మధు అనుచరులను కూడా విచారిస్తున్నారు. ఈ కేసులో మధు పాత్ర తేలితే..అరెస్టు చేసే అవకాశం ఉంది.

వాస్తవానికి పుట్ట మధు ప్రమేయం లేదని గతంలో కొంతమంది పోలీసు అధికారులు క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే రాజకీయ సమీకరణాలు మారడంతో.. ఆయనపేరు మళ్లీ తెరపైకి వచ్చింది. మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈయనపై ఎలాంటి చర్యలు తీసుకోని పోలీసులు..ఒక్కసారి కేసు దర్యాప్తు వేగవంతం చేశారు.

వామన్ రావు తండ్రి కిషన్ రావు ఐజీ నాగిరెడ్డికి లేఖ రాయడంతో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. ఏప్రిల్ 29వ తేదీ పుట్ట మధు అనుచరుడిగా ఉన్న..రఘువీర్ సింగ్ ను విచారించారు. ఏప్రిల్ 30వ తేదీ 41 సీఆర్పీసీ కింద పుట్ట మధుకు నోటీసులు జారీ చేశారు. అదే రోజు మధ్యాహ్నం మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ ఆక్రమణలపై మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో పుట్ట మధు అలర్ట్ అయ్యారు. రాష్ట్ర సరిహద్దులు దాటి పరారయ్యారు. పది రోజులు అజ్ఞాతంలో ఉన్న పుట్ట మధు ఎవరినీ కాంటాక్ట్ చేయకుండా జాగ్రత్త వహించారు. చివరకు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read More : India : భారతదేశంలో కరోనా విలయం, 24 గంటల్లో 4 లక్షల కేసులు, 4 వేల మంది మృతి