గ్రేటర్‌లో జోరుమీదున్న కారు : ఆధిక్యం దిశగా టీఆర్ఎస్

  • Published By: sreehari ,Published On : December 4, 2020 / 02:04 PM IST
గ్రేటర్‌లో జోరుమీదున్న కారు : ఆధిక్యం దిశగా టీఆర్ఎస్

ghmc elections 2020 results: హైదర్‌నగర్‌లో టీఆర్ఎస్ గెలిచింది. టీఆర్ఎస్ అభ్యర్థి నార్నె శ్రీనివాసరావు విజయం సాధించారు. రంగారెడ్డి నగర్ లో టీఆర్ఎస్ గెలిచింది. టీఆర్ఎస్ అభ్యర్థి విజయ్ శేఖర్ విజయం సాధించారు. ఇప్పటికే మెట్టుగూడ, హైదర్ నగర్ డివిజన్లు టీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది.

పలు డివిజన్లలో అధికార పార్టీకి బీజేపీ గట్టి పోటీనిస్తోంది. పాతబస్తీలోనూ మజ్లిస్ కు పలు డివిజన్లలో బీజేపీ గట్టి పోటీనిస్తోంది.

120 డివిజన్లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 10 డివిజన్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన 20 డివిజన్లలో కౌంటింగ్ ప్రారంభం కానుంది.