Nama Nageswararao : రాష్ట్ర విభజన నాటి నుంచి తెలంగాణకు అన్యాయం : నామా నాగేశ్వరరావు

తెలంగాణకు విద్యా సంస్థల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపుతుందని విమర్శించారు. అసోం, గుజరాత్, హర్యానా, హిమచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మణిపూర్, త్రిపురకు నవోదయ విద్యాలయాలు ఇచ్చారన్నారు.

Nama Nageswararao : రాష్ట్ర విభజన నాటి నుంచి తెలంగాణకు అన్యాయం : నామా నాగేశ్వరరావు

Nama Nageshwar Rao

TRS Nama Na0geswararao : రాష్ట్ర విభజన నాటి నుంచి 8 ఏళ్లుగా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. కేంద్రం… రాష్ట్రానికి ఇవ్వాల్సినవి ఇవ్వడం లేదని విమర్శించారు. నవోదయ విద్యాలయాల ఏర్పాటు గురించి ఉభయసభల్లో వాయిదా తీర్మానం ఇచ్చామని పేర్కొన్నారు. దానిపై ఉభయసభల్లో చర్చకు నిరాకరించారని తెలిపారు. రాష్ట్ర అంశాలకు పార్లమెంట్ లో స్థానం ఇవ్వలేదు కాబట్టి టీఆర్ఎస్ ఎంపీలంతా వాకౌట్ చేశామని వెల్లడించారు.

తెలంగాణలో జిల్లాకు ఒక నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు 9 మాత్రమే ఉన్నాయి..అన్ని జిల్లాలలో నవోదయా విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరారు. నవోదయా విద్యాలయాల గురించి ప్రధాని మోదికి లేఖ రాసినట్లు గుర్తుచేశారు. 16వ లోక్ సభ, 17వ లోక్ సభలో కూడా ఈ అంశాలు లేవనెత్తామని చెప్పారు.

TRS : కేంద్రంపై రెండువైపులా టీఆర్ఎస్ దాడి.. ఇటు ఢిల్లీలో అటు గల్లీలో

తెలంగాణకు విద్యా సంస్థల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపుతుందని విమర్శించారు. అసోం, గుజరాత్, హర్యానా, హిమచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మణిపూర్, త్రిపురకు నవోదయ విద్యాలయాలు ఇచ్చారు..కానీ తెలంగాకు ఇవ్వలేదని వాపోయారు. తెలంగాణ భారతదేశంలో లేదా..తెలంగాణ పౌరులు భారతీయులు కారా? అని ప్రశ్నించారు.

తెలంగాణ విద్యార్థులకు నవోదయా విద్యాలయాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి పార్లమెంట్ కు వచ్చిన బీజేపీ ఎంపీలు ఎందుకు తెలంగాణ సమస్యల గురించి మాట్లాడటం లేదని నిలదీశారు. తెలంగాణ అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.

Gutta Sukhendar Reddy : ధాన్యం విషయంలో కేంద్రం రైతులను ఇబ్బంది పెట్టొద్దు : గుత్తా సుఖేందర్ రెడ్డి

నవోదయ విద్యాలయాలను తీసుకువచ్చే బాధ్యత బీజేపీ ఎంపీలకు లేదా అని ప్రశ్నించారు. పెండింగ్ ఉన్న నవోదయా విద్యాలయాలను ఒక నెలలో బీజేపీ ఎంపీలు తీసుకురావాలన్నారు. నవోదయా విద్యాలయాలను రాష్ట్రానికి తీసుకొస్తే దండేసి దండం పెడతామని చెప్పారు. తెలంగాణకు న్యాయం జరిగే వరకు పార్లమెంట్ లో పోరాడుతామని స్పష్టం చేశారు.