TS Politics : పార్టీ మారొద్దు అంటూ ఎర్రబెల్లికి గులాబీ నేతల బుజ్జగింపులు..

పార్టీ మారాలని నిర్ణయించుకున్న టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లిని పార్టీ మారొద్దు అంటూ గులాబీ నేతల బుజ్జగిస్తున్నారు.ఎమ్మెల్సీ సారయ్య..మెట్టు శ్రీనివాస్ లు ఎర్రబెల్లి ఇంటికెళ్లారు. ఆయనకు నచ్చచెప్పారు. కానీ కార్యకర్తల అభీష్టమ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన స్పష్టంచేశారు.

TS Politics : పార్టీ మారొద్దు అంటూ ఎర్రబెల్లికి గులాబీ నేతల బుజ్జగింపులు..

TS Politics : వచ్చే ఏడాది తెలంగాణలో ఎన్నికలు జరుగనున్న క్రమంలో ఆయా పార్టీల నేతల టికెట్ల కోసం..రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీలు మారటంలో బిజీ బిజీగా ఉన్నారు. పార్టీ మార్పులకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీంట్లో భాగంగా
టీఆర్ ఎస్ నేతలు కూడా ఆయా పార్టీల్లోకి జంప్ అవ్వటానికి రెడీగా ఉన్నారు. వీరిలో ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కూడా ఉన్నారు. త్వరలో టీఆర్ఎస్ పార్టీని వీడి కాషాయ తీర్థం పుచ్చుకోబోతున్నారా? టిఆర్ఎస్ పార్టీలో మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావుకు తమ్ముడు ఊహించని ఝలక్ ఇవ్వబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తుంది.దీంతో పార్టీ మారొద్దు అంటూ ఎర్రబెల్లి ప్రదీప్ రావును బుజ్జగించే పనిలో పడ్డారు గులాబీ నేతలు.

ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఇంటికెళ్లి మరీ నచ్చ చెప్పే పనిలో పడ్డారు టీఆర్ఎస్ నేతలు. దీని కోసం ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మెట్టు శ్రీనివాస్ లు ప్రదీప్ రావు ఇంటికెళ్లారు. ఆయనకు నచ్చచెప్పారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు టీఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరిగినమాట వాస్తవమేనని..కానీ చాలా నమ్మదగిన వ్యక్తి ఆయన అంటూ చెప్పుకొచ్చారు. గులాబీ నేతల బుజ్జగింపులు అన్నీ విన్న ప్రదీప్ రావు మాత్రం పార్టీలో కొనసాగేందుకు ఏమాత్రం మొగ్గు చూపటంలేదు. తన కార్యకర్తలు అభీష్టం మేరకే తాను ఏం నిర్ణయమైనా తీసుకుంటాను అంటూ నిగూఢంగా సమాధానం చెప్పారు.

అన్న ఎర్రబెట్టి దయాకర్ రావు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి..తమ్ముడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే సీటు ఆశించారు. కానీ దక్కలేదు. కనీసం ఎమ్మెల్సీ సీటు అన్నా దక్కుతుందని ఆశించారు. అదీకాలేదు. దీంతో వచ్చే ఎన్నికలకైనా వేరే పార్టీ మారితే ఎమ్మెల్యే సీటు దక్కుతుందని ఆశతో ఎర్రబెల్లి ప్రదీప్ రావు..టిఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ వార్తల వెనుక వరంగల్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

చాలా కాలంగా టిఆర్ఎస్ పార్టీలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాజకీయాలు చేస్తూ అవకాశం కోసం ఎదురు చూస్తున్న నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి జిల్లాలో రాజకీయం చేశారు. ఇక అటువంటి ఎర్రబెల్లి ప్రదీప్ రావు చాలా కాలంగా టిఆర్ఎస్ పార్టీలో అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గతంలో ఎమ్మెల్యే టికెట్ ను ఆశించారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే బాగుండని ఎదురు చూశారు. కానీ టిఆర్ఎస్ పార్టీలో ఆయనకు ఇప్పటివరకు అవకాశం దక్కకపోవడంతో, భవిష్యత్తులో కూడా అవకాశం దక్కుతుంది అనే నమ్మకం కూడా లేకపోవటంతో పార్టీ మారాలని గట్టిగానే నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగాలని వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేయాలని భావిస్తున్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు..ఈక్రమంలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్నట్లుగా సమాచారం. వరంగల్ తూర్పు నియోజకవర్గాల భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేయడానికి..బలమైన నేత లేరని భావిస్తున్న క్రమంలో తనకు బీజేపీ నుంచే అవకాశం వస్తుందని ఎర్రబెల్లి ప్రదీప్ రావు పార్టీ మారడానికి రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎర్రబెల్లి ప్రదీప్ రావు తీసుకున్న నిర్ణయం ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంట్లో కలకలం రేపుతుంది. అన్న టిఆర్ఎస్ లో, తమ్ముడు బిజెపిలో.. విచిత్రమైన రాజకీయం అంటూ చర్చ జరుగుతుంది.